అతిపెద్ద బాంబు: ఐసిస్‌కు పెద్ద దెబ్బ, 'ట్రంప్! పాక్‌లోను దాడి చేయండి'
వాషింగ్టన్: ఆఫ్గానిస్థాన్‌లోని ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) స్థావరంపై అమెరికా జరిపిన అతిపెద్ద బాంబు దాడిలో 36 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఆప్గనిస్తాన్ రక్షణ శాఖ తెలిపింది.
వాషింగ్టన్: ఆఫ్గానిస్థాన్‌లోని ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) స్థావరంపై అమెరికా జరిపిన అతిపెద్ద బాంబు దాడిలో 36 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఆప్గనిస్తాన్ రక్షణ శాఖ తెలిపింది.
ఈ దాడిలో ఉగ్రవాదులకు చెందిన మూడు భూగర్భ సొరంగాలు, భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ధ్వంసమయ్యాయని చెప్పింది. అయితే సామాన్య పౌరులకు ఎలాంటి హానీ జరగలేదని తెలిపింది.
ఆఫ్గాన్-పాక్ సరిహద్దుల్లో గల నాన్‌గర్హర్ ప్రావిన్స్‌లోని అచిన్ జిల్లాలో అమెరికా ఈ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. జిల్లాలోని టనెల్ సముదాయంపై మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌గా పిలిచే 21,600 పౌండ్ల బరువుగల జీజీయూ-43/బి బాంబును గురువారం రాత్రి జార విడిచింది. తొలిసారిగా దీన్ని ఓ యుద్ధంలో ప్రయోగించారు.

అణు రహిత మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్
అమెరికా జారవిడిచిన ఈ బాంబును మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌గా పిలుస్తారు. ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ అణు రహిత బాంబును ప్రయోగించింది. ఐసిస్ టెర్రరిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే తూర్పు ఆప్ఘానిస్థాన్‌లోని నంగర్హార్‌లో ఈ బాంబును జార విడిచారు.

ఇలా జార విడిచింది
ఎంసీ-130 అనే విమానం నుంచి జీబీయూ-43 అనే ఈ బాంబును అమెరికా ప్రయోగించింది. నంగర్హార్ ప్రావిన్స్‌లోని అచిన్ జిల్లాలో ఉన్న ఐసిస్ టన్నెల్ కాంప్లెక్స్‌పై జీబీయూ-43/బీ బాంబును అఫ్ఘానిస్థాన్‌లోని అమెరికా బలగాలు ప్రయోగించాయి స్థానిక కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నర గంటలకు ఈ దాడి జరిగింది.

ఈ బాంబు ప్రభావం ఎంత అంటే..
యుద్ధం లేని సమయంలో అమెరికా ఈ స్థాయి బాంబును ప్రయోగించడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. దాదాపు 10 టన్నుల బరువైన ఈ బాంబు ప్రభావం వల్ల 300 చదరపు మీటర్ల ప్రాంతం పూర్తిగా కాలిపోయి, బూడిద అవుతుంది. దాదాపు 4 చ.కి.మీ. మేర ఈ బాంబు ప్రభావం ఉంటుందని తెలుస్తోంది.

పాక్‌లోను దాడి చేయండి.. ట్రంప్‌కు విజ్ఞప్తి
పాకిస్థాన్‌లో దాగి ఉన్న ఉగ్రవాద సంస్థల పైనా దాడులు చేయాలని అమెరికాకు చెందిన ప్రముఖ మాజీ దౌత్యవేత్త జల్మయ్ ఖలీల్ జాద్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కోరారు. ట్రంప్ యంత్రాంగం పాక్‌లోని ఉగ్రమూకలపై దాడి చేసి కుదిపేయాలన్నారు.
అఫ్గాన్‌లోని ఐసిస్ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై అతిపెద్ద బాంబును ప్రయోగించిన నేపథ్యంలో ట్రంప్‌కు ఆయన సూచన చేశారు.

సమస్యగా తాలిబన్ల స్థావరాలు
పాకిస్థాన్‌లోని తాలిబన్ల స్థావరాలు అఫ్గానిస్థాన్‌కు పెద్ద సమస్యగా మారాయని, అక్కడి ఉగ్రవాదులపైనా పోరాడాలని జల్మయ్ ఖలీద్ జాద్ అన్నారు. ఈయన బుష్ హయాంలో జల్మయ్ ఐరాసలో, అఫ్గాన్‌లో అమెరికా రాయబారిగా పని చేశారు. ట్రంప్ అధ్యక్ష ప్రచార సమయంలో ఆయన విదేశాంగ పాలసీకి సంబంధించి తొలి సమావేశాన్ని జల్మయ్ నిర్వహించారు.

తాలిబన్ల విషయంలో పాక్ పాలసీనే ఆప్గన్‌కు సమస్య
ఉగ్రవాద వ్యతిరేక పోరుతో అమెరికా పలుచోట్ల ఉన్న ఉగ్రసంస్థలను కుదిపేయాలని ఖలీద్్ జాద్ వాషింగ్టన్‌లోని హుడ్సన్ ఇనిస్టిట్యూట్‌లో మాట్లాడుతూ చెప్పారు. తాలిబన్ల విషయంలో పాకిస్థాన్ పాలసీనే అఫ్గానిస్థాన్‌కు ఉన్న ప్రధాన సమస్యల్లో ఒకటి అన్నారు.
-
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications