8మంది చిన్నారుల హత్య కేసు: తల్లి అరెస్ట్
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని కెయిర్న్ నగరంలో 8మంది చిన్నారులను ఆయుధాలతో పొడిచి చంపేసిన ఘటనలో వారి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలంతా 18 నెలల నుంచి 14 ఏళ్లలోపువారే. వాళ్లను చంపేందుకు ఆమెకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హత్యాస్థలం వద్ద టెడ్డీబేర్లు, పువ్వులు పడివున్నాయి. పిల్లల్లో ఏడుగురు ఆమె కన్న బిడ్డలే కాగా, ఎనిమిది చిన్నారికి ఆమె సమీప బంధువు. నిందితులైన 37ఏళ్ల మహిళను అరెస్ట్ చేసి, ప్రస్తుతం పోలీసుల భద్రతలో కెయిర్న్ బేస్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ బ్రూనో ఆస్నికర్ తెలిపారు.

ప్రస్తుతానికి ఆమె మీద తప్ప వేరెవ్వరి మీద అనుమానాలు లేవని, ఆ ప్రాంతం అంతా సురక్షితంగానే ఉందని చెప్పారు. శుక్రవారం జరిగిన 8మంది చిన్నారుల హత్యలు ఆస్ట్రేలియాను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఆ దేశ అధ్యక్షుడు టోనీ అబ్బాట్ కూడా ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
శుక్రవారం జరిగిన హత్యలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కెయిర్న్స్ పట్టణంలోని ఓ ఇంటి ఆవరణలో ఒక మహిళ గాయపడి ఉన్నట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మహిళను ఆస్పత్రికి తరలించి ఇంటిని శోధించగా 8 మంది పిల్లల మృతదేహాల లభ్యమయ్యాయి. మృతదేహాలను చూసిన పోలీసులు ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు.
గాయపడిన 35ఏళ్ల మహిళకు చికిత్స అందిస్తున్నామని, ఆమె తమ విచారణకు సహకరిస్తోందని పోలీసులు చెప్పారు. పిల్లలపై పదునైన ఆయుధంతో దాడి జరిగినట్లు గాయాలను బట్టి తెలుస్తోందని చెప్పారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications