వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరుత కరుణించింది: బోనులో బ్రతికిపోయిన చిన్నారి

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: తల్లి నిర్లక్షం వలన బోనులో పడిన రెండు సంవత్సరాల బాలుడి మీద చిరుత దయ చూపించింది. బిడ్డతో పాటు వారి కుటుంబ సభ్యులు బోనులోకి వెళ్లినా పెద్దగా పట్టించుకొకుండా చూసిచూడనట్లు ఉండిపోయింది.

అమెరికాలోని క్లీవ్ లాండ్ మెట్రో జూలో సినిమా ఫక్కిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. న్యూయార్క్ లోని దిల్ వరే అనే ప్రాంతంలో మిచెల్ స్కావబ్ (37) అనే మహిళ నివాసం ఉంటున్నది. ఈమెకు రెండు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.

ఇటివల మిచెల్ కుమారుడితో పాటు కుటుంబ సభ్యులతో కలిసి క్లీవ్ లాడ్ మెట్రో జూలోకి వెళ్లారు. తరువాత చిరుత ఉన్న ఎన్ క్లోజర్ (బోను) మీద కుమారుడిని కుర్చోపెట్టి అటు ఇటు ఊపడం మొదలు పెట్టింది. ఆ సందర్బంలో బాలుడు ఆకస్మికంగా ఎన్ క్లోజర్ లో పడిపోయాడు.

Mother dropped two-year-old boy into cheetah enclosure ai zoo

ఆ సమయంలో చిరుత అక్కడే ఉంది. ఆందోళన చెందిన మిచెల్, ఆమె భర్త ధైర్యం చేసి 10 అడుగులు కింద ఉన్న ఎన్ క్లోజర్ లోకి దూకేశారు. బాలుడిని ఎత్తుకుని బయటకు వచ్చారు. అయితే చిరుత మూడ్ బాగున్నట్లు ఉంది. బాలుడితో పాటు కుటుంబ సభ్యుల మీద జాలి చూపించి వదిలి పెట్టింది.

విషయం తెలుసుకున్న జూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుత ఉన్న ఎన్ క్లోజర్ మీద బాలుడిని కుర్చోపెట్టి ఆడించడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మిచెల్ మీద కేసు నమోదు చేశారు. ఎన్ క్లోజర్ లో పడిన బాలుడి కాలికి గాయం అయ్యిందని జూ అధికారులు తెలిపారు.

English summary
The zoo’s executive director says the cheetahs didn’t go toward the boy or his parents and that several eyewitnesses saw the woman holding the child over the railing
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X