కేవలం 30 సెకన్లలోనే కరోనావైరస్ అంతం: మౌత్‌వాష్ ప్రభావంపై తాజా అధ్యయనం
సియోల్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వ్యాపించకుండా ప్రజలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లను రాసుకోవడం, తరచూ చేతులను శుభ్రపర్చుకోవడం లాంటి చేస్తూనే ఉన్నారు. అయితే, తాజాగా, మౌత్‌వాష్ ద్వారా కరోనాకు అడ్డుకట్ట వేయచ్చవని ఓ తాజా అధ్యయనం తేల్చింది.
కొరియా యానివర్సటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు. 10 మిల్లీలీటర్ల క్లోరోహైక్సిడైన్ మౌత్‌వాష్‌ను 10 సెకన్లపాటు వాడటం వల్ల లాలాజలంలోని వైరస్ లోడ్ రెండు గంటలపాటు గణనీయంగా తగ్గుతుందని, దీంతో వైరస్ సోకే ప్రమాదం నుంచి బయటపడవచ్చని తెలిపారు.

అయితే, రెండు గంటల తర్వాత వైరస్ లోడ్ మళ్లీ పెరిగినట్లు శాస్త్రవేత్లు పేర్కొన్నారు. లాలాజలంలో అధిక వైరల్ లోడ్ ఉంటుంది. మాట్లాడుతున్నప్పుడు తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ప్రతి రెండు గంటలకు ఒకసారి ఈ మౌత్ వాష్‌ను ఉపయోగించడం వల్ల కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
కాగా, ఇప్పటికే కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి. అరడజనుకుపైగా వ్యాక్సిన్లు కీలకమైన మూడో దశ ట్రయల్స్‌కు చేరుకున్నాయి. వ్యాక్సిన్ వచ్చే వరకు మరింత సమయం పట్టనుండటంతో ఈ మౌత్ వాష్ ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications