వాజ్ పాయ్ కి బంగ్లాదేశ్ అత్యున్నత అవార్డు, అందుకోనున్న మోడీ
ఢాకా: భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పాయ్ కు బాంగ్లాదేశ్ ప్రభుత్వం అవార్డు ఇచ్చి సత్కరించాలని నిర్ణయించింది. 1971వ సంవత్సరంలో బాంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన సమయంలో వాజ్ పాయ్ మద్దతుగా నిలిచినందుకు అవార్డు అందిస్తున్నారు.
1971లో వాజ్ పాయ్ లోక్ సభ సభ్యుడిగా, జన్ సంఘ్ అధ్యక్షులుగా ఉన్నారు. ఆ సమయంలో బాంగ్లాదేశ్ పాకిస్థాన్ నుండి విడిపోయి స్వతంత్ర దేశం కోసం పోరాటం చేసింది. ఆ సందర్బంలో వాజ్ పాయ్ బాంగ్లాదేశ్ కు మద్దతు ఇస్తూ గట్టిగా తన వాణిని వినిపించారు.

అందుకు కృతజ్ఞతగా వాజ్ పాయ్ కి ఫ్రెండ్ ఆఫ్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అవార్డు ఇచ్చి ఘనంగా సన్మానించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే వాజ్ పాయ్ అనారోగ్యంతో ఉన్నారు.
వాజ్ పాయ్ తరుపన భారత ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 6వ తేదిన బాంగ్లాదేశ్ వెళ్లి అవార్డు తీసుకుంటున్నారు. పాక్- బంగ్లా విడిపోయిన సందర్బంలో బాంగ్లాదేశ్ కోసం పోరాటం చేసి మరణించిన భారత్ జవాన్ల సేవలను ఆ దేశ ప్రధాని షేక్ హసీనా స్మరించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications