మరాఠీలను అద్భుతంగా నమ్మొచ్చంటున్న సర్వే

లండన్: పలు అవినీతి ఆరోపణలు, కుంభకోణాలతో భారతదేశం అవినీతి సూచిలో తన స్థానాన్ని పెంచుకుంటూ ప్రపంచంలో అత్యధిక అవినీతికి పాల్పడుతున్న దేశాల సరసన చేరే దిశగా అడుగలు వేస్తోంది. అయితే అందుకు విరుద్ధంగా ప్రపంచంలోనే నమ్మకమైన నగరాలలో దేశ ఆర్థిక రాజధాని ముంబై ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది.

ముంబై నగరంలో ఎవరైనా వస్తువులు గానీ, పర్సు గానీ పోగొట్టుకున్నట్లయితే అవి దొరికిన వ్యక్తి తిరిగి ఆ వ్యక్తికి చేర వేసిన ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఇలాంటి మంచి పనులే ముంబై నగరాన్ని ప్రపంచంలోనే నమ్మకమైన నగరాలలో రెండో స్థానాన్ని కట్టబెట్టాయి. సగటున నగరంలో ఒక వ్యక్తి సుమారు రూ. 3వేల రూపాయలను ప్యాకెట్ మనీగా ఉంచుకుంటారు. సుమారు 12మంది తమ వ్యాలెట్ లేదా పర్సును పోగొట్టుకున్నట్లయితే వారిలో సుమారు 9మంది తమ వ్యాలెట్ లేదా పర్సును తిరిగి పొందుతున్నట్లు సర్వేలో స్పష్టమైంది.

Mumbai

ప్రపంచంలోని 16 మహా నగరాలలో ఈ సర్వే నిర్వహించారు. సర్వేలో భాగంగా ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాల రోడ్లపై, షాపింగ్ మాల్స్‌ల్లో, పార్కులు వద్ద ఫోన్ నెంబర్, ఫ్యామిలీ ఫొటో, వ్యాపార కార్డులను వ్యాలెట్లలో పెట్టి వదిలివెళ్లారు. ఈ నగరాలలో ఎంతమంది ఆ వ్యాలెట్లను తిరిగి ఇస్తారు అనే అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారు. న్యూయార్క్, జూరిచ్, హెల్సింకి మొదలగు నగరాలలో ఈ సర్వేను నిర్వహించారు.

ఇండియా కాక ఇతర దేశాల్లో 50 డాలర్లను పెట్టి వదిలిపెట్టిన వ్యాలెట్లలో సుమారు 47శాతం తిరిగి వచ్చినట్లు సర్వేలో తేలింది. ఫిన్‌లాండ్ రాజధాని నగరం హెల్సింకి ఈ సర్వేలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. హెల్సింకి నగరంలో వదిలివెళ్లిన 12 వ్యాలెట్లలో 11 వ్యాలెట్లను తిరిగి అందజేయడం జరిగింది. అయితే గొప్ప నగరాలుగా పేరున్న జూరిచ్‌లో 12 వ్యాలెట్లలలో 4 మాత్రమే తిరిగి రాగా, లండన్, ఆమ్సస్టర్డం నగరాల్లో 7 వ్యాలెట్లు మాత్రమే తిరిగి పొందడం జరిగింది.

మర్సా నగరంలో 5, జర్మనీ రాజధాని బెర్లిన్ నగరంలో 6 వ్యాలెట్లు తిరిగి వచ్చాయి.
మూడవ స్థానాన్ని దక్కించుకున్న న్యూయార్క్, బుడాపెస్ట్ నగరాల్లో 12లో 8 వ్యాలెట్లు తిరిగి ఇవ్వడం జరిగింది. ఈ సర్వేలో 12 వ్యాలెట్లలో ఒకటి మాత్రమే తిరిగి ఇచ్చి పోర్చుగల్ రాజధాని లిస్బన్ చిట్ట చివరి స్థానాన్ని దక్కించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+