ఆ మత ప్రబోధకుడి ముసుగులో అల్లర్లు: జీవితాంతం జైలులోనే
Anjem Choudary: ప్రముఖ ముస్లిం ప్రబోధకుడు అంజెమ్ చౌదరికు జీవిత కాలం కారాగార శిక్ష పడింది. భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ సిరియా అండ్ లెవాంట్‌తో ప్రత్యక్ష సంబంధాలు కలిగివున్నాడనే ఆరోపణలు రుజువు కావడం..ఈ శిక్షకు కారణమైంది. ఈ మేరకు లండన్ కోర్టు ఆదేశాలను జారీ చేసింది. బ్రిటన్‌లో స్థిరపడ్డ పాకిస్తాన్ మత ప్రబోధకుడాయన.
అల్- ముహాజిరన్ అనే నిషేధిత మత సంస్థతో సంబంధాలు ఉన్నాయంటూ కారణంతో గతంలో బ్రిటన్ పోలీసులు అంజెమ్ చౌదరిని అరెస్ట్ చేశారు. తమ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడం, అశాంతియుత వాతావరణనాకి కారణమౌతోందనే ఉద్దేశంతో 2016లో ఈ సంస్థను నిషేధించింది బ్రిటన్ ప్రభుత్వం.

దీనికి చీఫ్‌గా అంజెమ్ చౌదరి వ్యవహరించానే నేరారోపణలు అంజెమ్‌పై ఉన్నాయి. ఆయన కంటే ముందు అల్-ముహాజిరన్‌కు ఒమర్ బక్రీ మహ్మద్ చీఫ్‌గా వ్యవహరించారు. 2014లో లెబనాన్‌లో ఆయన అరెస్ట్ అయ్యారు. ఆ తరువాత ఆ బాధ్యతలను అంజెమ్ చేపట్టారు.
ఈ కారణంతో గతంలో లండన్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. దర్యాప్తు చేపట్టారు. లండన్‌లోని వూల్‌విచ్ క్రౌన్ కోర్ట్ దీనిపై విచారణ జరిపింది. అంజెమ్‌పై నమోదైన నేరారోపణలు రుజువు అయ్యాయి. దీనికి సంబంధంచిన సాక్ష్యాధారాలను దర్యాప్తు ఏజెన్సీలు న్యాయస్థానానికి సమర్పించాయి.
అల్-ముహాజిరిన్ వంటి సంస్థలు అంజెమ్ చౌదరి సహకారంతో ఆన్‌లైన్ ద్వారా సమావేశాలను నిర్వహిస్తూ భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించేలా వ్యవహరిస్తోన్నాయని దర్యాప్తు సంస్థలు స్పష్టం చేశాయి. వాటన్నింటిపైనా విచారణ జరిపిన అనంతరం వూల్‌విచ్ క్రౌన్ కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ మార్క్ వాల్ తుది తీర్పు వెలువడించారు.
ఆయనపై జీవితకాల శిక్ష విధించారు. పెరోల్‌కు అర్హత సాధించడానికి కనీసం 28 సంవత్సరాల జీవిత ఖైదును అనుభవించాల్సి ఉంటుందనీ చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాలు, హింసాయుత వాతావరణాన్ని ఏ దేశం కూడా అంగీకరించదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మరణించే వరకూ కారాగార శిక్షను గడపాల్సి ఉంటుందనీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications