భారత్ దెబ్బకు పాకిస్థాన్ అతలాకుతలం.. ఇప్పట్లో కోలుకోవడం కష్టమే..!
భారత్ నుండి చవకైన వ్యాక్సిన్ల సరఫరా నిలిచిపోవడం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం మోపిందని ఆరోగ్య శాఖ మంత్రి ముస్తఫా కమల్ తాజాగా తెలిపారు. 2025 మే నెలలో జరిగిన ఘర్షణల తర్వాత ఈ సరఫరా నిలిచిపోయింది.
గతంలో పాకిస్తాన్, గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్ (GAVI) ద్వారా చవకైన వ్యాక్సిన్‌లను కొనుగోలు చేసేది. GAVI అనేది ప్రపంచంలోని అత్యంత పేద దేశాల పిల్లలకు వ్యాక్సిన్‌లను అందించడానికి కృషి చేసే ఒక గ్లోబల్ పబ్లిక్- ప్రైవేట్ హెల్త్ పార్టనర్ షిప్.
మంత్రి కమల్ ప్రకారం, GAVI పాకిస్తాన్‌కు కొనుగోలు మధ్యవర్తిగా, ఆర్థిక భాగస్వామిగా వ్యవహరించి భారత్ నుండి వ్యాక్సిన్‌లను పొందడంలో సహాయపడింది. ఉద్రిక్త సంబంధాలున్నప్పటికీ, భారతీయ ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేసిన నాణ్యమైన, చవకైన వ్యాక్సిన్ లను GAVI అందించగలిగింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో COVAX సదుపాయం కింద మిలియన్ల కొద్దీ వ్యాక్సిన్‌లు భారత్ నుండి సేకరించబడ్డాయి.
ప్రస్తుతం పాకిస్తాన్ ఏటా సుమారు $400 మిలియన్ల విలువైన వ్యాక్సిన్‌లను దిగుమతి చేసుకుంటోందని మంత్రి కమల్ తెలిపారు. ఇందులో 49 శాతం వ్యయం GAVI ద్వారా అంతర్జాతీయ సంస్థలు, మిగిలిన 51 శాతం పాకిస్థాన్ భరిస్తోంది. 2031 నాటికి అంతర్జాతీయ మద్దతు ముగుస్తుందని, స్థానిక ఉత్పత్తి లేకపోతే దిగుమతి బిల్లు $1.2 బిలియన్లకు చేరుకుంటుందని ఆయన హెచ్చరించారు.
ప్రపంచంలో ఐదవ అత్యధిక జనాభా (సుమారు 240 మిలియన్లు).. ఏటా 6.2 మిలియన్ల జననాలతో పాకిస్థాన్ లో వ్యాక్సిన్‌ల డిమాండ్ భారీగా ఉంది. ప్రభుత్వం పౌరులకు 13 రకాల వ్యాక్సిన్‌లను ఉచితంగా అందిస్తోంది, అయితే ఏవీ దేశీయంగా ఉత్పత్తి కావడం లేదు. అంతర్జాతీయ సహాయం దిగుమతి వ్యయాన్ని అదుపులో ఉంచింది, కానీ ఈ పరిస్థితి మారనుందని మంత్రి హెచ్చరించారు.
దాతల మద్దతు కోసం ఎదురు చూచకుండానే, పాక్ ప్రభుత్వం స్థానికంగా వ్యాక్సిన్ల ఉత్పత్తికి సన్నాహాలు మొదలుపెట్టింది. దేశం సమీప భవిష్యత్తులో వ్యాక్సిన్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. ఇది దేశంపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి కీలకమని పేర్కొన్నారు.
ఈ సరఫరా నిలిపివేతకు కారణమైన 2025 మే నెల సంఘర్షణలో, 26 మంది పౌరుల మరణానికి దారితీసిన పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సింధూర్' ను ప్రారంభించింది. మే 7న మొదలైన ఈ ఆపరేషన్ పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకుంది.

ఈ దాడులు నాలుగు రోజుల పాటు తీవ్ర ఘర్షణలకు దారితీశాయి. మే 10న సైనిక చర్యల విరమణ ఒప్పందంతో ఇది ముగిసింది. ఈ సంఘర్షణ ఫలితంగానే భారత వ్యాక్సిన్ల సరఫరా ఆగిపోయింది.
-
హార్దిక్ అవుట్ తో కృనాల్ వైల్డ్ సెలబ్రేషన్స్- ఆ వివాదమే అసలు కారణమా..!? -
చియా సీడ్స్ తీసుకుంటున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !!












Click it and Unblock the Notifications