Aung San Suu Kyi: నిర్బంధం నుంచి జైలుకు: మాజీ అధ్యక్షుడికీ కారాగార శిక్ష

యాంగూన్: మయన్మార్ ప్రజా ఉద్యమకారణి అంగ్‌సాన్ సూకీకి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఈ మేరకు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం ఆమె గృహ నిర్బంధంలో ఉంటున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసి, సైన్యం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత హౌస్ అరెస్ట్ చేసింది. ఇదివరకు అంగ్‌సాన్ సూకీపై నమోదు చేసిన కేసుల విచారణ సందర్భంగా దోషిగా తేలడంతో నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడింది.

సైనిక పాలన నుంచి విముక్తి పొందినా..

సైనిక పాలన నుంచి విముక్తి పొందినా..

మయన్మార్ సుదీర్ఘ కాలం పాటు సైనిక పాలనలో కొనసాగింది. 2011 వరకూ ఆ దేశం సైనిక పాలనలోనే ఉండేది. అంగ్‌సాన్ సూకీ ఏళ్ల తరబడి గృహ నిర్బంధంలో గడిపారు. అనేక అంతర్జాతీయ ఒత్తిళ్ల తరువాత ఆమె విముక్తి పొందారు. 2015లో నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో ఆమె సారథ్యంలోని ఎన్ఎల్‌డీ ఘన విజయాన్ని సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయిదేళ్ల కాల వ్యవధి ముగియడంతో గత ఏడాది నవంబర్‌లో మరోసారి ఎన్నికలను నిర్వహించారు. వరుసగా రెండోసారి ఎన్ఎల్‌డీకి విజయం వరించింది. 2015 నాటి కంటే మెజారిటీ సీట్లను సాధించగలిగింది.

సైనిక తిరుగుబాటుతో..

సైనిక తిరుగుబాటుతో..

ఈ నిర్వహించిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ అక్కడి సైన్యాధికారులు ఆరోపించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు, ఇతర సమాచారాన్ని ఎన్నికల కమిషన్ కార్యాలయానికి అందజేశారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టారు ఎన్నికల అధికారులు. మిలటరీ అధికారులు చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. ఎలాంటి అక్రమాలు గానీ, అవకతవకలు గానీ చోటు చేసుకోలేదని ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన రెండు రోజుల్లోనే.. సైనికులు తిరుగుబాటును లేవదీయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

కోవిడ్ ప్రొటోకాల్స్ ఉల్లంఘన సహా..

కోవిడ్ ప్రొటోకాల్స్ ఉల్లంఘన సహా..

ఆ తరువాత అంగ్‌సాన్ సూకీని మిలటరీ అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆమెతో పాటు అధికార పార్టీకి చెందిన పలువురిని అరెస్ట్ చేశారు. ఎలాంటి కారణాన్ని చూపకుండా సూకీ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచీ అంగ్‌సాన్ సూకీ నిర్బంధంలోనే ఉంటున్నారు. ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ కేసులు నమోదయ్యాయి. అలాగే- కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ప్రవేశపెట్టిన ప్రొటోకాల్స్‌ను కూడా ఉల్లంఘించినట్లు సూకీపై కేసు పెట్టింది సైనిక ప్రభుత్వం.

మాజీ అధ్యక్షుడికీ జైలు..

మాజీ అధ్యక్షుడికీ జైలు..

కోవిడ్ ప్రొటోకాల్స్ ఉల్లంఘించిన కారణంగా నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు న్యాయస్థానం తీర్పు వెలువడించింది. నేచురల్ డిజాస్టర్ చట్టం, సెక్షన్ 505 (బీ) కింద రెండేళ్ల చొప్పున శిక్షను విధించినట్లు సైనిక ప్రభుత్వ అధికార ప్రతినిధి జా మిన్ టున్ తెలిపారు. మాజీ అధ్యక్షుడు విన్ మ్యింట్‌కు కూడా ఇదే కారణంతో నాలుగు సంవత్సరాల పాటు కారాగార శిక్షను విధించింది న్యాయస్థానం. దీనికి అదనంగా మరిన్ని కేసుల్లో తీర్పు వెలువడాల్సి ఉందని జా మిన్ టున్ చెప్పారు.

 కక్ష సాధింపు చర్యలుగా..

కక్ష సాధింపు చర్యలుగా..

ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం, ప్రభుత్వ రహస్యాలను ప్రత్యర్థులకు చేరవేయడం, సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టడం, అఫీషియల్ సీక్రెట్స్ సహా పలు చట్టాల ఉల్లంఘన కింద అంగ్‌సాన్ సూకీపై పలు కేసులు నమోదయ్యాయి. వాటన్నింటికీ సంబంధించిన తీర్పులు ఇంకా వెలువడాల్సి ఉంది. తాజా పరిణామాలపై సూకీ స్పందించారు. తనపై కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. అవన్నీ నిరాధారమైన కేసులని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+