భావ వ్యక్తీకరణలో నా కన్నా మోడీకి మంచి ప్రతిభ ఉంది: రాహుల్ గాంధీ

ప్రధాని నరేంద్ర మోడీపై, ఆయన ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశంసలతో పాటు విమర్శలు కురిపించారు. భావ వ్యక్తీకరణలో ప్రధాని మోడీకి మంచి ప్రతిభ ఉందన్నారు.

కాలిఫోర్నియా: ప్రధాని నరేంద్ర మోడీపై, ఆయన ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశంసలతో పాటు విమర్శలు కురిపించారు. భావ వ్యక్తీకరణలో ప్రధాని మోడీకి మంచి ప్రతిభ ఉందన్నారు.

ప్రధాని మోడీ తన కంటే చాలా బాగా మాట్లాడతారని ప్రశంసించిన రాహుల్, మోడీతో కలిసి పనిచేసే వారి మాటలను ఆయన పట్టించుకోరట అంటూ విమర్శలు కూడా కురిపించారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.

modi-rahul

రాహుల్, నిన్న బర్క్ లీ లోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో ప్రసంగిస్తూ ప్రధాని మోడీ గురించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. సభలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో మోడీకి బాగా తెలుసని, ఆయనతో కలసి పనిచేసే వారి మాటలను మోడీ పరిగణనలోకి తీసుకోరని, ఆ పార్టీకి చెందిన కొందరు ఎంపీలే ఈ విషయాన్ని తనతో చెప్పారని అన్నారు.

తనతో కలసి పని చేసే వారి మాటలను కూడా మోడీ పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా రాహుల్ సూచించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలపై విమర్శలు కురిపించిన రాహుల్, మేకిన్ ఇండియా పథకం బడా వ్యాపారులకే వర్తిసుందన్నారు. అయితే 'స్వచ్ఛభారత్' పథకం తీసుకురావడం మాత్రం బాగుందని ప్రశంసించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+