నవాజ్ షరీఫ్‌తో ప్రధాని మోడీ కరచాలనం(ఫొటో)

ప్యారిస్: ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జరుగుతున్న అంతర్జాతీయ వాతావరణ సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్థాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌లు కలుసుకున్నారు. ఆత్మీయంగా వారు కరచాలనం చేసుకోవడం మీడియా దృష్టిని ఆకర్షించింది.

సోమవారం ప్యారిస్‌లో వాతావరణ మార్పులపై అంతర్జాతీయ స్థాయి సదస్సు(సిఓపి-21) ప్రారంభమైంది. ఈ సదస్సుకు హాజరైన మోడీ, షరీఫ్‌లు ఒకరినొకరు కలుసుకుని నవ్వుతూ కరచాలనం చేశారు.

Narendra Modi meets Nawaz Sharif at climate summit in Paris

ఈ ఫొటోను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి దాదాపు 140 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.

కాగా, ఈ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోడీ మొదట ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్ హొలాండ్‌ను కలుసుకున్నారు. ఆయనతో మర్యాదపూర్వకంగా కరచాలనం చేశారు. ఆ తర్వాత వివిధ దేశాధినేతలను పలుకరించారు.

ఈ సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్‌ మాట్లాడుతూ.. వాతావరణ మార్పులపై ప్రస్తుత సదస్సు అత్యంత కీలకమైనదని, ఈ సదస్సులో వెలువడే నిర్ణయం ప్రస్తుతమున్న ప్రజల తలరాతనే కాదు.. రాబోయే తరాల ప్రజలపైనా ప్రభావం చూపుతుందని, ఈ సదస్సులో సానుకూల నిర్ణయాన్ని ప్రపంచం ఆశిస్తున్నదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+