• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నాసా అద్భుతం: గ్రహశకలంపై స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్: నాలుగేళ్లు వెంటాడి..మరీ: ఎంత దూరమో తెలుసా?

|

వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష ప్రయోగాల సంస్థ.. నాసా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. కల్లో కూడా ఊహించని అద్భుతం అది. సెకెనుకు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఓ గ్రహ శకలంపైకి తన స్పేస్ క్రాఫ్ట్‌ను సురక్షితంగా దించింది. ఆ గ్రహశకలంపై విస్తృత పరిశోధలను ఆరంభించింది. గ్రహశకలంపై ప్రయోగాలను చేపట్టడానికి తాము ప్రయోగించిన స్పేస్ క్రాఫ్ట్ సురక్షితంగా దిగినట్లు నాసా ఓ ప్రకటనలో వెల్లడించింది. దిగిన వెంటనే.. తన కార్యకలాపాలను ఆరంభించిందని, ఈ మిషన్ సజావుగా సాగుతుందని పేర్కొంది.

ఆర్మీ చేతుల్లో బందీ: చైనా సైనికుడి అప్పగింత పూర్తి: 48 గంటల సుదీర్ఘ విచారణలో తేలిందేమిటి?

నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణం..

గ్రహశకలాలపై ప్రయోగాలను చేపట్టాలనే కల ఈ నాటిది కాదు. పదేళ్ల కిందటే ఈ దిశగా కీలక ప్రయోగాలను చేపట్టింది నాసా. నాలుగేళ్ల కిందట ఓ స్పేస్ క్రాఫ్ట్‌ను ప్రయోగించింది. ఆ స్పేస్‌క్రాఫ్ట్ పేరు ఒసిరిస్-రెక్స్. 2016లో కెనడీ స్పేస్ సెంటర్‌ నుంచి దీన్ని ప్రయోగించింది నాసా. నాలుగేళ్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణం.. చివరికి సుఖాంతమైంది. తన గమ్యానికి చేరుకుందా స్పేస్‌క్రాఫ్ట్. బెన్ను అని పేరు పెట్టిన ఓ భారీ గ్రహశకలంపై దిగింది. ఎగుడు దిగుళ్లతో కూడిన ఉపరితలంపై సురక్షితంగా వాలింది. ఆ వెంటనే- దాని మీద ఉండే గులక రాళ్లు, దుమ్మును సేకరించే పనిలో పడింది. అక్కడ సేకరించిన ఖనిజాలను తీసుకుని.. మళ్లీ తిరుగుముఖం పడుతుంది.

గ్రహశకలం ప్రత్యేకతలేంటీ?

బెన్ను అస్టరాయిడ్.. 1999 సెప్టెంబర్ 11వ తేదీన దీన్ని తొలిసారిగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మిగిలిన వాటితో పోల్చుకుంటే.. భూమికి దగ్గరగా తిరుగాడే గ్రహశకలం ఇది. అదే నెల 23వ తేదీన భూమికి అత్యంత సమీపానికి వచ్చి.. విశ్వాంతరాల్లోకి వెళ్లిపోయింది. బెన్ను.. ఈజిప్షియన్ పురాణగాథల్లో ఉండే పక్షి పేరు. ఆ పేరునే ఈ గ్రహశకలానికి పెట్టారు. 12 సంవత్సరాల తరువాత మరోసారి భూమికి చేరువగా వచ్చింది. అప్పుడే దీనిపై ప్రయోగాలను చేపట్టాలని నాసా శాస్త్రవేత్తలు భావించారు. టచ్ అండ్ గో విధానంలో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. గ్రహశకలంపై వాలిన వెంటనే అక్కడి దుమ్ము, రాళ్లను సేకరిస్తుంది. ఆ వెంటనే మళ్లీ వెనక్కి వచ్చేస్తుందా ప్రోబ్.

330 మిలియన్ కిలోమీటర్ల దూరంలో..

కిలోమీటర్ పొడవు, 1600 అడుగుల డయామీటర్‌ను కలిగిన ఈ గ్రహశకలం ఉపరితలం ఎత్తుపల్లాలు, మొనదేలిన రాళ్లతో నిండి ఉంటుంది. న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పరిమాణంలో ఉంటుంది ఇది. తన చుట్టూ తాను తిరుగుతూ ఉండే ఈ గ్రహశకలంపై ప్రయోగాలను చేపట్టడానికి స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపించాలని నిర్ణయించుకున్నారు. భూమి నుంచి గరిష్ఠంగా 330 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఈ అస్టరాయిడ్ ప్రయాణం సాగుతోంది. దీనిమీదికి ఒసిరిస్-రెక్స్ స్పేస్‌క్రాఫ్ట్ సురక్షితంగా దిగింది. దీనికి సంబంధించిన ఓ క్లిప్‌ను నాసా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

16 సెకెన్లలో..

తాము అంచనా వేసినట్లే 16 సెకెన్ల అతి సూక్ష్మ సమయంలోనే ఈ స్పేస్ క్రాఫ్ట్ ప్రోబ్.. గ్రహశకలంపై అడుగు మోపిందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీన్ని ల్యాండ్ చేయడానికి సుమారు 18 నిమిషాల సమయం పట్టిందని అన్నారు. కొలరాడో డెన్వర్‌లోని లాక్‌హీడ్ మార్టిన్ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని కంట్రోల్ చేస్తున్నారు. గ్రహ శకలం మీది నుంచి 60 మిల్లీగ్రాముల మేర దుమ్ము, చిన్నపాటి గులకరాళ్లను సేకరిస్తుందని చెప్పారు. అనంతరం తిరుగుముఖం పడుతుందని, 2023 సెప్టెంబర్ నాటికి భూమికి చేరుకుంటుందని నాసా సైంటిస్ట్ మిఛెల్లీ థాల్లర్ తెలిపారు. 2018లో ఈ అస్టరాయిడ్‌కు సంబంధించిన కొన్ని జూమ్ ఇన్ ఫొటోలను ఒసిరిస్-రెక్స్ భూమికి పంపించిందని, దాని ఆధారంగా దాని ఉపరితల స్థితిగతులను అధ్యయనం చేసినట్లు మిఛెల్లీ తెలిపారు.

  Nokia “Connecting Moon”, Nokia Wins NASA Contract to Put 4G Network on Moon| First LTE/4G in Space

  English summary
  After a four-year journey, NASA's robotic spacecraft Osiris-Rex briefly touched down on asteroid Bennu's boulder-strewn surface on Tuesday to collect rock and dust samples in a precision operation 200 million miles (330 million kilometers) from Earth.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X