ఉగ్రవాది నవెద్ నా కోడుకే, పాక్ నుండి యూసఫ్
ఇస్లామాబాద్: జమ్మూ కాశ్మీర్ లో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రాణాలతో పట్టుబడిన లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాది మహమ్మద్ నవెద్ యాకూబ్ పాకిస్థాన్ కు చెందిన వాడే అని రుజువు అయ్యింది. అతని తండ్రి యూసఫ్ మహమ్మద్ స్వయంగా నవెద్ నాకుమారుడు అని అంగీకరించాడు.
ఈ దెబ్బతో పాకిస్థాన్ నోట్లో వెలక్కాయపడినట్లు అయ్యింది. అయితే లష్కర్-ఏ-తోయిబా నాయకులు మమ్మల్ని చంపేస్తారని యూసఫ్ మహమ్మద్ ఆందోళన చెందుతున్నాడు. పాకిస్థాన్ లోని ఫైస్లాబాద్ నుండి యూసఫ్ సయ్యద్ హిందూస్థాన్ టైమ్స్ ప్రతినిధితో ఫోన్ లో మాట్లాడారు.
ఈ సందర్బంగా యూసఫ్ సయ్యద్ మాట్లాడుతూ లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు నా కుమారుడు నవెద్ మహమ్మద్ కు మాయమాటలు చెప్పి లోంగదీసుకున్నారని, అతనికి బ్రెయిన్ వాష్ చేశారని వాపోయాడు. మేము ఎంత చెప్పినా నా కోడుకు నవెద్ మహమ్మద్ మా మాట వినలేదని ఆవేదన చెందాడు.

చివరికి లష్కర్ ఉగ్రవాదులతో చేరిపోయి కాశ్మీర్ లో చోరబడ్డాడని విలపించారు. నవెద్ భారత్ సైనికుల దాడిలో మరణిస్తాడని లష్కర్ నాయకులు ఊహించారని, అయితే నా కోడుకు ప్రాణాలు గట్టివి కాబట్టే అతడు బ్రతికిపోయాడని అన్నాడు. నవెద్ బ్రతకడంతో లష్కర్ ఉగ్రవాదులు మా కుటుంబ సభ్యులను అంతం చేస్తారని ఆందోళన చెందాడు.
లష్కర్-ఏ-తోయిబా మాటలు విని నవెద్ తప్పు చేశాడని, అతను ముమ్మాటికి తన కుమారుడే అని యూసఫ్ మహమ్మద్ స్పష్టం చేసిన వెంటనే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. నవెద్ అన్ని విషయాలు బయటకు చెప్పే అవకాశం ఉండటంతో అతని కుటుంబ సభ్యులు ప్రాణహాని ఉందంటు హడలిపోతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications