‘లాడెన్ నుంచి షరీఫ్ భారీగా డబ్బులు తీసుకున్నారు’
ఇస్లామాబాద్: పాకిస్ధాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ గురించి పాకిస్థాన్ నిఘా సంస్థ (ఐఎస్ఐ) మాజీ ఉద్యోగి భార్య తన పుస్తకంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ నుంచి డబ్బులు తీసుకున్నాడని ఆమె రాసిన పుస్తకంలో వెల్లడించారు.
ఐఎస్ఐ మాజీ అధికారి ఖలీద్ ఖవాజా భార్య షమామ ఖలీద్ 'ఖలీద్ ఖవాజా: షహీద్-ఐ-అమాన్' అనే పుస్తకాన్ని రాశారు. అందులో ఆమె ఈ సంచలన వివరాలు వెల్లడించారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు లాడెన్ నుంచి ఈ డబ్బు తీసుకున్నాడని చెప్పారు.

'బెనజిర్ భుట్టో పరిపాలనకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ చీఫ్ నవాజ్ షరీఫ్ ఒసామా బిన్ లాడెన్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. దీంతో ఆల్‌ఖైదా అతడికి భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చింది. దీంతో ఆయన అధికారంలోకి వచ్చాడు' అని ఆమె పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications