వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

50వేల ఏళ్ల తర్వాత భూమికి దగ్గరగా అరుదైన ఆకుపచ్చ తోకచుక్క: వచ్చే వారమే చూడండి

సుదీర్ఘ కాలం తర్వాత ఓ అరుదైన తోక చుక్క భూమికి దగ్గరగా రానుంది. సుమారు 50,000 సంవత్సరాల విరామం తర్వాత.. అరుదైన ప్రకాశవంతమైన ఆకుపచ్చ తోకచుక్క భూమికి తిరిగి వస్తోంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సుదీర్ఘ కాలం తర్వాత ఓ అరుదైన తోక చుక్క భూమికి దగ్గరగా రానుంది. సుమారు 50,000 సంవత్సరాల విరామం తర్వాత.. అరుదైన ప్రకాశవంతమైన ఆకుపచ్చ తోకచుక్క భూమికి తిరిగి వస్తోంది. వచ్చే వారం బుధ, గురువారాల్లో భూమిని సమీపించే సమయంలో స్టార్‌గేజర్(నక్షత్రాలను చూసేవారు) అందరూ ప్రకాశవంతమైన తోకచుక్కను చూడవచ్చు.

50 వేల ఏళ్ల తర్వాత దర్శనమిస్తున్న అరుదైన తోకచుక్క

50 వేల ఏళ్ల తర్వాత దర్శనమిస్తున్న అరుదైన తోకచుక్క

తోకచుక్క అనేది మంచు, ధూళి కేంద్రకంతో కూడిన ఖగోళ దృగ్విషయం. ఇది సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు, సూర్యుని నుంచి దూరంగా వెళ్లే వాయువు, ధూళి కణాలు "తోక"లా మారతాయి. దీంతో అవి తోకచుక్కలుగా కనిపిస్తాయి. మనం ఇప్పటి వరకు చుక్కలు, తోకచుక్కలను కూడా చూసివుంటాం. కానీ, ఇప్పుడు 50వేల ఏళ్ల క్రితం కనిపించిన అరుదైన ఆకుపచ్చ తోకచుక్కను వచ్చేవారం చూడబోతున్నాం.

ఈ తోక చుక్కను చివరి జాతి నియాండర్తల్‌లు

ఈ తోక చుక్కను చివరి జాతి నియాండర్తల్‌లు

C/2022 E3 అనే ఈ తోక చుక్క గత 50వేల ఏళ్ల నుంచి ఇప్పటి వరకు భూమికి దగ్గరగా రాలేదు. అయితే, వచ్చే వారం మాత్రం ఈ తోకచుక్క భూమికి అత్యంత సమీపంలోకి వస్తుండటంతో సాధారణ కళ్లతోనే దీన్ని చూడవచ్చు. భూగోళం నుంచి ఈ అరుదైన తోకచుక్క 2.5 కాంతి నిమిషాలు లేదా 27 మిలియన్ మైళ్ల దూరంలోంచి ప్రయాణిస్తుంది. నియాండర్తల్‌లు దీనిని చూసిన చివరి జాతిగా భావిస్తున్నారు.

బైనాక్యులర్లు, టెలిస్కోప్‌లతో తోకచుక్క మరింత స్పష్టంగా..

ప్రకాశవంతమైన తోకచుక్కను చూడాలనుకునే వారు వచ్చే బుధవారం లేదా గురువారం నాడు సిద్ధంగా ఉండాలి. తోకచుక్క కేంద్రకం దాని అణువులపై, ముఖ్యంగా డయాటోమిక్ కార్బన్, సైనోజెన్‌లపై సూర్యరశ్మి చర్య కారణంగా స్పష్టమైన ఆకుపచ్చ కాంతిని విడుదల చేస్తుంది. గత ఏడాది మార్చి 2న, ఖగోళ శాస్త్రవేత్తలు ఫ్రాంక్ మాస్కీ, బ్రైస్ బోలిన్ జ్వికీ ట్రాన్సియెంట్ ఫెసిలిటీని ఉపయోగించి దీనిని కనుగొన్నారు.బైనాక్యులర్లు, టెలిస్కోప్‌లతో మాత్రం మరింత స్పష్టంగా ఈ తోకచుక్కను చూడవచ్చు. ఈ తోక చుక్కను చూసేందుకు వచ్చే వారం అద్భుతమైన అవకాశం అని నాసా ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఈ అరుదైన తోక చుక్కను ఎలా కొనుగొని చూడవచ్చంటే?

తోకచుక్కను చూడటానికి, మీరు ఉత్తరం వైపు చూడాలి. కామెట్(తోక చుక్క) డ్రాకో సమీపంలో ఉంటుంది. ఇది బిగ్ డిప్పర్, లిటిల్ డిప్పర్ మధ్య ఉన్న డ్రాగన్-ఆకారపు కూటమి. జనవరి 21 తర్వాత, అమావాస్య రాత్రి, మీరు చీకటి ఆకాశం చూస్తారు. తోకచుక్క అనేక రాత్రులు డ్రాగన్ తోకను అనుసరిస్తుంది.
జనవరి 30న కామెట్ నేరుగా బిగ్ డిప్పర్, పోలారిస్, నార్త్ స్టార్ "కప్" మధ్య ఉంటుంది. మీరు బిగ్ డిప్పర్స్ కప్పులో రెండు నక్షత్రాలను అనుసరించడం ద్వారా నార్త్ స్టార్‌ను కనుగొనడం అలవాటు చేసుకున్నట్లయితే, మీరు ఈ తోకచుక్కను కనుగొనవచ్చు.
మీరు కొంచెం స్మెర్‌ని గమనించే వరకు ఆ ఊహాత్మక రేఖను స్కాన్ చేస్తే సరిపోతుంది. మీకు తోకచుక్కను చూడటంలో సమస్య ఉంటే, అది ఇంకా చాలా బలహీనంగా ఉండటం లేదా చాలా కాంతి కాలుష్యం ఉండటం వల్ల కావచ్చు. ఈ క్రమంలో మీరు బైనాక్యులర్‌ సాయంతో స్పష్టంగా ఈ అరుదైన తోక చుక్కను చూడవచ్చు.

English summary
Nearly After 50,000 Years, Rare Green Comet To Pass By Earth; details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X