వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Don't Miss:ఆకాశంలో భారీ తోక చుక్క.. మళ్లీ 6800 సంవత్సరాల తర్వాతే..!

|
Google Oneindia TeluguNews

నాసా: రానున్న కొన్ని రోజుల్లో ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సూర్యుడు అస్తమించే సమయంలో ఆకాశంలో ఒక భారీ తోకచుక్క కనువిందు చేయనుంది. దీనిపేరు నియోవైస్ అని నాసా వెల్లడించింది. ఇది కొన్ని నిమిషాల పాటు ఆకాశంలో దర్శనమిస్తుందని నాసాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ తోకచుక్కను ఈ ఏడాది మార్చి 27న నాసా నియోవైస్ అనే ఇన్‌ఫ్రారెడ్ స్పేస్ టెలిస్కోప్‌తో కనుగొన్నందున దీనికి నియోవైస్ అని నామకరణం చేసింది. ఇక ఈ తోకచుక్క అధికారిక నామం c/2020 F3 నియోవైస్. ఈ తోకచుక్కను మామూలుగానే ఎలాంటి కళ్లజోడు లేకుండా చూడొచ్చని నాసా స్పష్టం చేసింది.

మూడువారాల పాటు కనువిందు చేయనున్న తోకచుక్క

ఇప్పటి నుంచి మూడు వారాల పాటు ఈ తోకచుక్క కనువిందు చేయనుందని నాసా వెల్లడించింది. గత వారంతో పోలిస్తే ఇప్పుడు కాస్త మందంగా ఉందని నాసా వెల్లడించింది. సూర్యుడు అస్తమించాక అరగంట పాటు ఈ తోకచుక్క వాయువ్య దిశలో ఉన్న ప్రాంతాల నుంచి కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రస్తుతం ఈ తోకచుక్క భూమికి దగ్గరగా పయనిస్తోందని చెప్పిన శాస్త్రవేత్తలు రోజులు గడిచేకొద్ది ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. ఉదాహరణకు జూలై 16న సాయంత్రం 6:30 గంటలకు బెంగళూరులో ఆకాశంలో 16 డిగ్రీలతో గంట పాటు కనిపిస్తుందని ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌ మాజీ ప్రొఫెసర్ ఆర్‌సీ కపూర్ చెప్పారు. ఇక జూలై 23 నాటికల్లా ఈ తోకచుక్క భూమికి 103.6 మిలియన్ దూరంలో ఉంటుందని చెప్పారు. ఆ రోజు 35 డిగ్రీల ఎలివేషన్‌తో కనిపిస్తుందని చెప్పారు.

 ఎక్కడి నుంచి చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది..?

ఎక్కడి నుంచి చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది..?


ఇక ఈ తోకచుక్కను స్పష్టంగా చూడాలంటే కాలుష్యంలేని ప్రాంతాల్లో ఉండాలని వెల్లడించారు. బైనాక్యులర్ ఉంటే మరింత స్పష్టంగా దగ్గరగా ఈ తోకచుక్క కనిపిస్తుందని ఆయన చెప్పారు. జూలై తొలివారంలో ఈ తోకచుక్క సూర్యోదయం సమయంలో కనిపించేదని ఇప్పుడు సూర్యాస్తమయం సమయంలో కూడా కనువిందు చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నియోవైస్ అనే ఈ తోకచుక్క సౌర వ్యవస్థ వెలుపల నుంచి వచ్చిందని నాసా చెబుతోంది. జూలై 3వ తేదీన దీని కక్ష్య సూర్యుడికి అతిసమీపంలోకి వచ్చిందని నాసా పేర్కొంది. ఇక అక్కడ ప్రమాదం నుంచి తప్పించుకుని భూమివైపు పయనిస్తోంది.

సూర్యాస్తమయం సమయంలో...

సూర్యాస్తమయం సమయంలో...

ఒక వేళ ఉదయాన్నే కనుక మీకు నిద్రలేచే అలవాటు ఇంటే నియోవైస్ అనే ఈ తోక చుక్క 10 డిగ్రీల ఎలివేషన్‌తో ఈశాన్య సమాంతర దిశగా కనిపిస్తుంది. శనివారం నాటికి ఇది 5 డిగ్రీలకు తగ్గిపోతుంది. ఆ తర్వాత సూర్యోదయం సమయంలో కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. సూర్యాస్తమయం తర్వాత ఇది ఆకాశంలో పెద్ద ఎత్తులో కనిపిస్తుంది. ఆదివారం నాటికి సూర్యాస్తమయం సమయానికి ఇది 20 డిగ్రీలతో కనిపిస్తుంది. ఈ తోకచుక్క 5 కిలోమీటర్ల పొడవు ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. చాలా వరకు తోకచుక్కలు సగం దుమ్ముతో నిండి ఉంటే మరో సగం నీటితో నిండి ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే నియోవైస్ తోకచుక్క 13 మిలియన్ల ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ వాటర్ సైజులో ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 మళ్లీ కనిపించేది ఎప్పుడో తెలుసా..?

మళ్లీ కనిపించేది ఎప్పుడో తెలుసా..?

నియోవైస్ తోకచుక్క గంటకు 40వేల మైళ్ల వేగంతో పయనిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. భూమికి ఇది 70 మిలియన్ మైళ్ల దూరంలో ఉన్నట్లు చెప్పారు. ఈ తోకచుక్క వల్ల భూమికి ఎలాంటి హాని జరగదని స్పష్టం చేశారు. ఈ సారి కనిపించే నియోవైస్ తోకచుక్క మళ్లీ 6,800 సంవత్సరాల తర్వాత కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇంత కాంతివంతంగా ఉన్న తోకచుక్క చివరిసారిగా 1995 మరియు 1996లో కనిపించిందని గుర్తు చేసిన శాస్త్రవేత్తలు ఆ తోకచుక్క పేరు హేల్-బాప్ అని చెప్పారు.

English summary
An amazing comet that thrilled early-morning stargazers earlier this month is now visible in the evening sky, and it's a sight you won't want to miss. After all, this comet won't be back for 6,800 years, NASA says.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X