నేపాల్ పార్లమెంట్ సభలో ఘర్షణ... దేశ వ్యాప్త బంద్‌కు పిలుపు
న్యూఢిల్లీ: నేపాల్ పార్లమెంట్‌లో ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం దాడులకు దిగారు. ఒకరిపై ఒకరు చొక్కాలు పట్టుకుని తన్నుకున్నారు. కొత్త రాజ్యాంగ విషయంలో అధికార, విపక్షాల మధ్య తలెత్తిన బేధాభిప్రాయాలు ఒకరిపై మరొకరు భౌతిక దాడులకు దిగేవరకు వచ్చింది.
పార్లమెంట్‌లో స్పీకర్ సుమాంగ్ రాజ్యాంగ ముసాదా ప్రతిని ప్రవేశపెట్టేందుకు ప్రశ్న పత్రాన్ని చదివే సమయంలో ప్రతిపక్ష నాయకులు స్పీకర్‌పైకి దూసుకెళ్లారు. ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా పెద్ద ఘర్షణ చోటు చేసుకుంది.

ఒకరిపై మరొకరు చైర్లను విసురుకున్నారు. దీంతో సభను వాయిదా వేశారు. పార్లమెంట్‌లో ఘర్షణ జరిగిన కొన్ని గంటలకు నేపాల్ మొత్తం అట్టుడికిపోతుంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా 30 ప్రతిపక్ష పార్టీల కూటమి నేపాల్ మొత్తం ఆందోళనలకు పిలుపునిచ్చింది. నిరసనకారులు కొంత మంది నేపాల్‌లో బస్సులకు, ట్యాక్సీలకు నిప్పు పెట్టారు.
రంగంలోకి దిగిన పోలీసులు 50 మందికి పైగా నిరసనకారులను అరెస్టు చేశారు. దేశం మొత్తం ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా 6,000మంది పోలీసులను మోహరించారు. మావోయిస్టు తిరుగుబాటుదారులతో 2006లో సివిల్‌వార్ ముగిసిన తర్వాత నేపాల్‌కు రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. ఆరుగురు ప్రధామంత్రులు మారారు.












Click it and Unblock the Notifications