నేపాల్ కొత్త దేవతగా.. మూడేళ్ల చిన్నారి.. త్రిష్ణ షక్య!
నేపాల్ కొత్త దేవతగా ఖాట్మాండులోని అతిపురాతనమైన నెవార్ తెగకు చెందిన త్రిష్ణ షక్యను ఎన్నుకున్నారు. త్రిష్ణను నూతన కుమారిగా ఎంపిక చేసినట్లు పూజారి ఉద్ధవ్‌మాన్ కర్మాచార్య తెలిపారు. గురువారం జరిగే వేడుకలో
ఖాట్మాండు: ఎన్ని విమర్శలు వస్తున్నా.. నేపాల్‌లో సజీవ దేవతల ఎంపిక కొనసాగుతూనే ఉంది. తాజాగా నేపాల్ కొత్త దేవతగా ఖాట్మాండులోని అతిపురాతనమైన నెవార్ తెగకు చెందిన త్రిష్ణ షక్యను ఎన్నుకున్నారు.
కుమారిగా పిలిచే ఈ చిన్నారి దేవతను ఎన్నుకునే ప్రాచీన సంప్రదాయం ఇప్పటికీ అక్కడ అమల్లో ఉంది. ఈ పాపకు ముందు కుమారిగా ఉన్న మతైనే షక్య ఇప్పుడు యవ్వనంలోకి అడుగుపెట్టడంతో కొత్త కుమారి ఎంపికను పూజారులు చేపట్టాల్సి వచ్చింది.
బుధవారం ఖాట్మాండులో జరిగిన కార్యక్రమంలో నలుగురు పోటీపడగా, త్రిష్ణను నూతన కుమారిగా ఎంపిక చేసినట్లు పూజారి ఉద్ధవ్‌మాన్ కర్మాచార్య తెలిపారు. గురువారం జరిగే వేడుకలో అమె నియామకాన్ని ప్రకటిస్తారు.

చిన్నారి దేవతను ప్రత్యేక పీఠంపై కూర్చోబెట్టి ప్రార్థనలు, తాంత్రిక పూజలు నిర్వహంచి అనంతరం ఆమెను ఇంటి నుంచి పురాతన దర్బార్ స్కేర్‌కు తీసుకెళ్తారు. కుమారిగా మారిన తర్వాత త్రిష్ణ దర్బార్‌లో తనకు కేటాయించిన ప్రదేశంలోనే ఉండాలి.
ప్రత్యేక సేవికలు అమెను కంటికి రెప్పలా చూసుకుంటారు. యుక్తవయస్సు వచ్చేవరకు త్రిష్ణ దేవతగా పూజలందుకోనుంది. ఏడాదికి 13 సార్లు పర్వదినాల సందర్భంగా మాత్రమే చిన్నారి దేవతను బయటకు తీసుకువస్తారు. దేవతలా అలంకరించిన ఆమెను సేవికలు ఎత్తుకుని ఊరేగిస్తారు.
హిందూ, బౌద్ధ మత ఆచారాలు కలగలిసిన నేవార్ తెగలోని పిల్లల్నే సర్వసాధారణంగా కుమారిలుగా ఎంపిక చేస్తుంటారు. పిల్లలను దేవతలుగా మార్చడం అంటే వారిని బాల్యానికి దూరం చేయడమేనని, వారి స్వేచ్ఛను హరించడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications