కూలిన విమానం: అంతా మృతి, ఎవరూ మిగలలేదు
ఖాట్మండ్: ఇటీవల జరిగిన విమాన ప్రమాదం నుంచి ఎవరూ బయటపడలేదని నేపాల్ పోలీసులు సోమవారం చెప్పారు. ఇటీవల నేపాల్‌లో ఓ విమానం కూలింది. 18 మంది ప్రయాణికులతో బయలుదేరిన నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోయింది. దాని శకలాలను పోలీసులు సోమవారం గుర్తించారు.
పర్యాటక కేంద్రమైన పొఖారా పట్టణం నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే విమానం నుంచి సంకేతాలు రావడం ఆగిపోయింది. ఆదివారం బయలుదేరిన ఈ విమానంలో 18 మంది ప్రయాణిస్తున్నారు. ఖాట్మండ్‌కు ఈ ప్రాంతం 253 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

విమానం పర్వత ప్రాంతంలో కూలిపోయింది. దాని శకలాలు ఓ గ్రామంలో కనిపించాయి. అయితే, ఎవరూ బతికి బయటపడలేదని ఖాట్మండ్ విమానాశ్రయం చీఫ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ బిమ్లేష్ లాల్ కర్నా చెప్పారు.
విమానంలో ఉన్నవారిలో 15 మంది ప్రయాణికులు కాగా, ముగ్గురు సిబ్బంది. ఈ విమానంలో ఓ డెన్మార్క్ ప్యాసెంజర్ ఉన్నట్లు సమాచారం. అధికార నేపాలీ కాంగ్రెసు పార్టీ నాయకుడు మనబ్ సెజువాల్ కూడా ఇందులో ఉన్నారు.
విమానాన్ని వెతకడానికి రెండు హెలికాప్టర్లను నియోగించారు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో వెనక్కి వచ్చాయి. చివరకు అర్ఘఖంచి జిల్లాలో ఏరియల్ సర్వే చేసి విమానం శకలాలను కనుక్కున్నారు.












Click it and Unblock the Notifications