వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్ భూకంపం: భారీగా ఆస్తి నష్టం, పొలాల్లో టెంట్ల కిందనే(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వరుస భూప్రకంపనలతో నేలమట్టమైన నేపాల్‌లో సుమారు లక్షన్నరకు పైగా ఇళ్లు కూలిపోయినట్లు తెలుస్తోంది. మరో లక్షకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. 1934లో సంభవించిన భూకంపంలో కూలిపోయిన (అప్పట్లో 80, 893 ఇల్లు ధ్వంసం) దానికంటే ఈసారి భారీగా విధ్వంసం జరిగింది.

అప్పట్లో హిమాలయాలకు ఇటు ఉన్న నేపాల్, అటు బీహార్‌లోని చాలా ప్రాంతాలు నేలమట్టమయ్యాయి. కానీ గత వారంలో సంభవించిన భూకంపం వల్ల నేపాల్ రాజధాని ఖాఠ్మండు పూర్తిగా నేలమట్టమైంది. ముఖ్యంగా గోర్ఖా, సింధూపాల్‌చౌక్‌ జిల్లాల్లో 90 శాతం ఇల్లు కూలిపోయాయని ఐక్యరాజ్యసమితి అనుబంధ మానవతా విభాగం ‘ఓఛా' తెలిపింది.

ఈ ప్రాంతాల్లో ప్రాణ నష్టం సైతం ఎక్కువగానే నమోదైంది. సింధూపాల్‌చౌక్‌ జిల్లాలోనే రెండు వేల మంది చనిపోయారు. ఏప్రిల్ 25(శనివారం)నాడు సంభవించిన భూకంపానికి, ఇప్పటిదాకా ఏడు వేల మంది చనిపోయారని ప్రభుత్వం ప్రకటించింది. సుమారు వెయ్యి మంది గోర్ఖాలో చనిపోయారని ‘ఓఛా' నివేదిక తెలిపింది.

 భారీగా ఆస్తి నష్టం, ఇంకా పొలాల్లో టెంట్లు కిందే

భారీగా ఆస్తి నష్టం, ఇంకా పొలాల్లో టెంట్లు కిందే

నేపాల్ భూకంపానికి 80 లక్షల మంది బాధితులయ్యారు. వీరిలో సుమారు 20 లక్షల మంది చిన్నారులే ఉన్నారు. వీరికి తక్షణ వైద్య సహాయం అవసరమని ‘ఓఛా' తెలిపింది.

 భారీగా ఆస్తి నష్టం, ఇంకా పొలాల్లో టెంట్లు కిందే

భారీగా ఆస్తి నష్టం, ఇంకా పొలాల్లో టెంట్లు కిందే

వీరిలో 14 లక్షల మంది చిన్నారులకి తక్షణం ఆహారం అందించాల్సి ఉంది. ఆరు నుంచి 23 నెలల వయస్సు చిన్నారులు 12 లక్షలకు పైగా ఉండగా, వీరంతా సరైన పోషకాహారం అందక ఇబ్బంది పడుతున్నారు.

 భారీగా ఆస్తి నష్టం, ఇంకా పొలాల్లో టెంట్లు కిందే

భారీగా ఆస్తి నష్టం, ఇంకా పొలాల్లో టెంట్లు కిందే

అందులోనూ 3.20 లక్షల మంది పిల్లలకు తక్షణం విటమిన్‌ ఏ అవసరం ఉంది. 1.26 లక్షల మంది గర్భిణిలు ఉండగా, రెండు లక్షలకు పైగా అమ్మాయిలు భూకంప పీడితులుగా మారారు.

 భారీగా ఆస్తి నష్టం, ఇంకా పొలాల్లో టెంట్లు కిందే

భారీగా ఆస్తి నష్టం, ఇంకా పొలాల్లో టెంట్లు కిందే

నేపాల్ ప్రజలు ఇంకా రోడ్డు మీదే గడుపుతున్నారు. ఖాట్మండు నుంచి సింధూపాల్‌చౌక్‌ వరకూ గల తెగిపోయిన రహదారులు, అగడ్తల వెంట వరుసగా టెంట్లు దర్శనమిస్తున్నాయి.

 భారీగా ఆస్తి నష్టం, ఇంకా పొలాల్లో టెంట్లు కిందే

భారీగా ఆస్తి నష్టం, ఇంకా పొలాల్లో టెంట్లు కిందే

మరికొంత మంది ఇళ్లకు వెళ్లే సాహసం చేయలేక నదీ ఒడ్డున, పొలాల్లో తాత్కాలిక ఏర్పాట్లు చేసుకొని ఉంటున్నారు. కాగా, ఎగువ తమకోషీ ప్రాంతంలో చిక్కుబడిపోయిన చైనా సిబ్బందికి ఇప్పట్లో విముక్తి దొరికే దారి కనిపించడం లేదు.

 భారీగా ఆస్తి నష్టం, ఇంకా పొలాల్లో టెంట్లు కిందే

భారీగా ఆస్తి నష్టం, ఇంకా పొలాల్లో టెంట్లు కిందే

తమకోషీ ప్రాంతంలో నేపాల్‌కు భాగస్వామిగా చైనా హైడ్రోపవర్‌ ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ప్రాజెక్టు పనిలో పాల్గొంటుండగా భూకంపం విరుచుకుపడటంతో 200మంది చైనా సిబ్బంది చిక్కుబడిపోయారు.

English summary
Relief supplies for earthquake victims have been piling up at the airport and in warehouses here because of bureaucratic interference by Nepalese authorities who insist that standard customs inspections and other procedures be followed, even in an emergency, officials with Western governments and aid organizations said on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X