చైనాకు నేపాల్ షాక్: 2.5బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ డీల్ రద్దు

చైనాకు నేపాల్‌ షాకిచ్చింది. తమ దేశంలోని బుదీ గండకి ప్రాజెక్టు(1200మెగావాట్స్ ప్లాంట్) నిర్మాణానికి చైనా కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టును రద్దుచేసింది.

బీజింగ్‌: చైనాకు నేపాల్‌ షాకిచ్చింది. తమ దేశంలోని బుదీ గండకి ప్రాజెక్టు(1200మెగావాట్స్ ప్లాంట్) నిర్మాణానికి చైనా కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టును రద్దుచేసింది. మాజీ ప్రధాని ప్రచండ హయంలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చైనా కంపెనీ గెజువా గ్రూప్‌నకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అయితే 2.5బిలియన్ ప్రాజెక్టు ప్రాజెక్టు నిర్మాణంలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై నేపాల్‌ మంత్రి మండలి సమావేశమై సుదీర్ఘంగా చర్చించి ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సమాచారాన్ని నేపాల్‌ ఉపప్రధాని కమల్‌థాపా తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు.

Nepal scraps $2.5 billion hydropower plant deal with Chinese company

మధ్యనేపాల్‌లో ప్రవహించే బుదీగండకి నదిపై జలవిద్యుత్‌ కేంద్రం నిర్మాణంతో పాటు పలు ఇతర పనులను చైనా కంపెనీకి కేటాయించారు. అయితే కాంట్రాక్ట్‌ పొందిన సంస్థ పనులు సక్రమంగా చేపట్టడం లేదని తేలడంతో కాంట్రాక్‌ రద్దు చేసినట్టు సమాచారం.

నేపాల్ దేశంలో వివిధ ప్రాజెక్టులు నిర్మించేందుకు చైనా, భారత కంపెనీల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే జీఎంఆర్ గ్రూప్, సత్లూజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ కంపెనీలు నేపాల్‌లో తలో ప్రాజెక్టు చేపట్టాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+