యుద్ధం ఎఫెక్ట్.. ఇజ్రాయెల్ ప్రధాని కుమారుడి పెళ్లి వాయిదా
పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య యుద్ధం తీవ్రతరం అవుతోంది. ఇరు దేశాలు నువ్వా నేనా అంటూ పోట్లాడుతున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కుమారిడి వివాహం వాయిదా పడింది. యుద్ధం కారణంగా పెళ్లిని వాయిదా వేసినట్లు సమాచారం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కుమారుడు అవ్ నేర్ నెతన్యాహు.. తన ప్రియురాలు అమిత్ యార్దేనీ ని జూన్ 15 వ తేదీన వివాహం చేసుకోవాలని నిశ్చయించారు. కానీ ఇరాన్ తో యుద్ధం కారణంగా పెళ్లిని వాయిదా వేస్తూ ఇజ్రాయెల్ ప్రధాని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 15న జరగాల్సిన తన కుమారుడి పెళ్లిని వాయిదా వేశారు. అయితే యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రధాని ఇంట పెళ్లి సందడిపై ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆందోళనలు చేపట్టారు. దీంతో కుమారుడి పెళ్లిని వాయిదా వేస్తూ ప్రధాని నెతన్యాహు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇక ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ కు చెందిన కీలక సైన్యాధికారులు, అణు శాస్త్రవేత్తలు మృతి చెందారు. ఇరాన్ లోని టెహ్రాన్ లక్ష్యంగా యుద్ధ విమానాలు, మిస్సైల్స్ తో ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ లోని చమురు శుద్ధి కేంద్రాలు, సహజ వాయువు నిక్షేపాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది. జూన్ 14 రాత్రి ఇరాన్ లోని చమురు శుద్ధి కేంద్రాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. ఈ క్రమంలో కాంగన్ లోని సౌత్ పోర్ట్ సిటీ వద్ద గల సౌత్ పార్స్ చమురు శుద్ధి కేంద్రం పూర్తిగా ధ్వంసం అయింది. ఇరాన్ ఆయిల్ నిక్షేపాలు, సహజ వాయువు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ చేపట్టిన దాడుల్లో 10 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో 180 మంది గాయపడ్డట్లు సమాచారం ఇచ్చారు. ఈ దాడుల్లో 7 గురు మిస్సింగ్ అయినట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications