ప్రపంచానికి కొత్త భయం: కలవరపెడుతున్న కాంగో ఫీవర్.. డబ్ల్యూహెచ్ఓ ఆందోళన
ఇప్పుడు ప్రపంచాన్ని కొత్త వ్యాధి కలవరపెడుతుంది. ఇరాక్ దేశంలో పెరుగుతున్న కాంగో ఫీవర్ ప్రపంచవ్యాప్త ఆందోళనకు కారణంగా మారింది. కరోనా ఉధృతి కాస్త తగ్గింది అని ఊపిరి తీసుకుంటున్న జనాలకు ఓవైపు మంకీ పాక్స్ ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు కాంగో ఫీవర్ కొత్తగా కలకలం రేపుతుంది. తాజాగా ఇరాక్ దేశంలో కాంగో ఫీవర్ తో ప్రజలు మృత్యువాత పడుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.

ప్రాణాంతక వైరస్ కాంగో ఫీవర్... అలెర్ట్ అంటున్న డబ్ల్యూహెచ్ఓ
పేలలో ఉండే నైరోవైరస్ ద్వారా కాంగో ఫీవర్ వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ పశువుల దగ్గరున్నా, ఈ వైరస్ ఉన్న పేలు కుట్టినా సోకుతుంది. తలనొప్పి, జ్వరం, వాంతులు, విరోచనాలు, శ్వాస సమస్య ఈ వ్యాధికి ఉన్న ప్రధాన లక్షణాలు. దీనిని ప్రాణాంతక వైరస్ గా పేర్కొని డబ్ల్యూహెచ్ఓ దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. ప్రస్తుతం ఇరాక్ దేశంలో ఈ వ్యాధి సోకిన పశువులను, వాటి పేలను సేకరించి పరిశోధన చేస్తున్నారు. అలాగే ఇది వ్యాప్తి చెందకుండా పురుగు మందులను పిచికారి చేస్తున్నారు.

గతం కంటే ఉధృతంగా ఇరాక్ లో కాంగో ఫీవర్.. ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదు
ఇది చాలా త్వరగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్న కారణంగా రక్షణ కిట్లను ధరించి మరీ కాంగో ఫీవర్ నియంత్రణకు ఇరాక్ దేశంలో ఆరోగ్య సిబ్బంది చర్యలు చేపట్టారు. వర్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, ఈ సంవత్సరం ఇరాక్ ప్రజలలో 111 కాంగో ఫీవర్ కేసులలో 19 మరణాలను నమోదు చేసింది. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ లేదు మరియు త్వరగా ప్రారంభమవుతుందని డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. దీని వలన అంతర్గతంగా మరియు బాహ్యంగా, ముఖ్యంగా ముక్కు నుండి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది.

ముక్కు నుండి తీవ్ర రక్తస్రావంతో మృతి
వైద్యుల ప్రకారం, ఇది రెండు వంతుల కేసులలో మరణానికి కారణమవుతుందని పేర్కొంది. ముక్కు నుండి తీవ్ర రక్త స్రావం జరిగి ప్రజలు మరణించే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు వైద్య శాఖాధికారులు. ప్రస్తుతం దక్షిణ ఇరాక్‌లోని పేద వ్యవసాయ ప్రాంతం, ఇరాక్‌లో దాదాపు సగానికి పైగా కేసులు ఈ ప్రావిన్స్‌లో ఉన్నాయి. మునుపటి సంవత్సరాల్లో, ఈ కేసులు చాలా తక్కువగా నమోదు కాగా ఈసారి అనూహ్యంగా విపరీతంగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది.

ఇరాక్ లో కాంగో ఫీవర్ తో ప్రపంచ దేశాలకు కొత్త భయం
1979లో ఇరాక్‌లో మొదటిసారిగా వైరస్ నమోదు చేయబడినప్పటి నుండి 43 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా ఈసారి కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరం కేసుల పెరుగుదల అధికారులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏది ఏమైనా వ్యాక్సిన్ లేని ఈ కాంగో ఫిగర్ ఇరాక్లో విజృంభిస్తున్న నేపద్యంలో మిగతా దేశాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. ఇరాక్ దేశంలో మాంసం తినాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఈ కాంగో ఫీవర్ కేసులను నియంత్రించటానికి ఆరోగ్య సిబ్బంది, అధికార యంత్రాంగం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications