వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలోని ఆరు నగరాల్లో వీసా సేవా కేంద్రాలు

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: భారతీయ రాయబార కార్యాలయం వీసా సంబంధిత కార్యకలాపాల కోసం నియమించిన(ఔట్ సోర్సింగ్) కొత్త కంపెనీ కాక్స్ అండ్ కింగ్స్ గ్లోబల్ సర్వీసెస్ వీసా సేవలందించేందుకు అమెరికా వ్యాప్తంగా ఆరు నగరాల్లో తమ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.

ఈ సేవా కేంద్రాలను వాషింగ్టన్ డిసి, న్యూయార్క్, అట్లాంటా, చికాగో, హూస్టన్, శాన్‌ఫ్రాన్సిస్కో ఏర్పాటు చేయనుంది. ఇవి మే 21 నుంచి అందుబాటులోకి వస్తాయి. ఇండియన్ వీసా రిక్వైర్‌మెంట్స్, ఓవర్సీస్ సిటిజెన్స్ ఆఫ్ ఇండియా (ఓసిఐ), పీపుల్ ఆఫ్ ఇండియన్ ఓరిజిన్(పిఐఓ), అమెరికాలో ఉంటున్న భారతీయ పౌరులకు వీసా విషయంలో కావాల్సిన సహకారం, విజిట్ వీసా సేవలు అందించనున్నట్లు కాక్స్ అండ్ కింగ్స్ గ్లోబల్ సర్వీసెస్(సికెజిఎస్) మంగళవారం ప్రకటించింది.

New Indian visa service centres open in six US cities

సికెజిఎస్ సేవా కేంద్రాల్లో వీసా సేవలకు సంబంధించిన అన్ని సేవలు అందించనున్నట్లు తెలిపింది. టూరిస్ట్, బిజినెస్, కాన్ఫరెన్స్, స్టూడెంట్ వీసా, ఇతర సేవలు అమెరికాలోని భారత జాతీయులకు అందించనున్నట్లు పేర్కొంది. భారత దౌత్య కార్యాలయంతో పని చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని సికెజిఎస్ తెలిపింది. ఆరు నగరాల్లో ఏర్పాటు చేసిన సేవా కేంద్రాల నుంచి దరఖాస్తులు తీసుకుంటామని సికెజిఎస్ సిఈఓ సంజయ్ భదూరి తెలిపారు.

వివరాల కోసం http://www.in.ckgs.us సంప్రదించవచ్చని చెప్పారు. అమెరికాలో ఉన్న అన్ని భారత దౌత్య కార్యాలయాల్లోనూ సేవలందిస్తున్న బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ స్థానంలో పొరుగుసేవల కింద కాక్స్ అండ్ కింగ్స్ గ్లోబల్ సర్వీసెస్ కంపెనీని నియమిస్తున్నట్లు అమెరికాలోని ఇటీవల భారత దౌత్య కార్యాలయం ప్రకటించిన విషయం తెలిసిందే.

English summary
The new company to which the Indian Embassy in the US outsourced its visa related work for its diplomatic missions there, will be opening service centres across six cities in America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X