గర్భం దాల్చిన ఇద్దరు మహిళా ఖైదీలు... జైల్లో అది ఎలా సాధ్యపడింది..?
న్యూజెర్సీ: నేరాలు చేసిన మగాళ్లు, మహిళలను వేర్వేరు జైళ్లకు తరలిస్తున్న విషయం తెలిసిందే. నేరం చేసినట్లు రుజువు అయితే వారికి పడిన శిక్షను పూర్తిగా జైల్లో అనుభవించాల్సి ఉంటుంది. భారతదేశంతో పాటు అగ్రదేశాల్లో కూడా మహిళలకు ప్రత్యేక జైల్లు ఉన్నాయి. నేరాలు చేసిన మహిళలు జైళ్లల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మహిళా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు మహిళలు గర్బవతులు కావడంతో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మహిళలు ఉండే సెంట్రల్ జైల్లో మహిళా ఖైదీలు ఎలా గర్బవతులు అయ్యారు అనే అసలు విషయం బయటకు రావడం కలకలం రేపింది.

న్యూజెర్సీలో మహిళా సెంట్రల్ జైలు
న్యూజెర్సీలోని ఎడ్నా మహన్ కరెక్షనల్ ఫెసిలిటీ మహిళా సెంట్రల్ జైలు ఉంది, న్యూజెర్సీలో ఉన్న ఏకైక మహిళా సెంట్రల్ జైలు అయిన ఎడ్నా మహన్ కరెక్షనల్ ఫెసిలిటీలో నేరాలు చేసిన అనేక మంది మహిళలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ మహిళా సెంట్రల్ జైలుకు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.

ఇద్దరు మహిళలు గర్బవతులు
న్యూజెర్సీలోని ఎడ్నా మహన్ కరెక్షనల్ ఫెసిలిటీ మహిళా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు మహిళలు గర్బవతులు కావడంతో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మహిళా ఖైదీలు ఉండే ఎడ్నా మహన్ కరెక్షనల్ ఫెసిలిటీ సెంట్రల్ జైల్లో మహిళా ఖైదీలు ఎలా గర్బవతులు అయ్యారు అనే అసలు విషయం బయటకు రావడం కలకలం రేపింది.

మహిళల కోరికలు తీర్చిన హిజ్రాలు?
ఎడ్నా మహన్ కరెక్షనల్ ఫెసిలిటీ మహిళా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు మహిళలు అదే జైలులో ఉన్న హిజ్రాలు (ట్రాన్స్ జెండర్)ల కారణంగా గర్బవతులు అయ్యారని మహన్ కరెక్షనల్ ఫెసిలిటీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాన్ స్పెర్రాజ్ చెప్పారని స్థానిక మీడియా చెప్పింది. మహన్ కరెక్షనల్ ఫెసిలిటీ మహిళా సెంట్రల్ జైల్లో 27 మంది ట్రాన్స్ జెండర్ శిక్ష అనుభవిస్తున్నారని డాన్ స్పెర్రాజ్ మీడియాకు చెప్పారు.

అసలు ఏం జరిగింది?. పరస్పర అంగీకారంతో!
2021 జూన్ లో న్యూజెర్సీ జైళ్ల శాఖలో లింగమార్పిడి చెయ్యని వాళ్లకు లింగ నిర్దారణ చేసిన తరువాత వారిని మహిళా జైళ్లకు తరలించారని అధికారులు అంటున్నారు. అయితే హిజ్రాల కారణంగా ఇద్దరు మహిళా ఖైదీలు గర్బవతులు అయ్యారని ఎన్ జే. కామ్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రచురించింది. అయితే ఈ విషయంపై ఉన్నతస్థాయి విచారణ జరుగుతోందని, మహిళా ఖైదీలు, హిజ్రాలు పరస్పర అంగీకారంతో శారీరకంగా కలిశారని మాకు సమాచారం ఉందని మహన్ కరెక్షనల్ ఫెసిలిటీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాన్ స్పెర్రాజ్ చెప్పారని స్థానిక మీడియా చెప్పింది.












Click it and Unblock the Notifications