వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sharia law: మళ్లీ యధాతథంగా అమలు: ఆప్ఘనిస్తాన్ మహిళల్లో..!

|
Google Oneindia TeluguNews

కాబుల్: షరియా లా.. ఆప్ఘనిస్తాన్ ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేసే చట్టం ఇది. ప్రత్యక్ష నరకం ఎలా ఉంటుందో ఆప్ఘనిస్తానీయులకు పరిచయం చేసిన చట్టంగా దీన్ని చెబుతుంటారు. ఈ షరియా చట్టాన్ని తాలిబన్ ప్రభుత్వం ఎక్కడ అమలు చేస్తుందోననే భయంతోనే ఆప్ఘనిస్తాన్ ప్రజలు ప్రాణాలకు తెగించి పుట్టిన గడ్డ వదిలి వెళ్లడానికి ప్రయత్నించారు. ఏ చట్టాన్నయితే అమలు చేయకూడదని వారు కోరుకుంటోన్నారో.. అదే చట్టం నీడలోకి వెళ్లడానికి సిద్ధపడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటోన్నారు ఆఫ్ఘనిస్తానీయులు.

Mexico earthquake: వణికిన తీర ప్రాంతాలు: సునామీ వార్నింగ్ సెంటర్ అలర్ట్Mexico earthquake: వణికిన తీర ప్రాంతాలు: సునామీ వార్నింగ్ సెంటర్ అలర్ట్

కఠిన చట్టం.. షరియా లా

కఠిన చట్టం.. షరియా లా

రెండు దశాబ్దాల కిందట ఆప్ఘనిస్తాన్‌ను పరిపాలించిన తాలిబన్లు షరియా చట్టాన్ని అమలు చేశారు. షరియా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి మరణశిక్షను సైతం విధించడానికి వెనుకాడలేదు. అదెంత కఠినంగా ఉంటుందనేది అక్కడి ప్రజలకే కాదు.. ప్రపంచం మొత్తానికీ తెలుసు. ఇక తాజాగా- మళ్లీ అలాంటి పరిస్థితే అక్కడ ఏర్పడబోతోంది. ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించిన తాలిబన్లు.. ఆ వెంటనే బాంబులాంటి వార్తనూ వెల్లడించారు. షరియా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

షరియాపై తొలిసారిగా..

షరియాపై తొలిసారిగా..

ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తరువాత.. షరియా చట్టం గురించి తాలిబన్లు ప్రస్తావించడం ఇదే తొలిసారి. అందులో ఎలాంటి మార్పులు ఉండబోవని, రెండుదశాబ్దాల కిందట అమలు చేసిన చట్టాన్ని యధాతథంగా ఇప్పుడు కూడా కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. పత్రికా స్వేచ్ఛ, మీడియా ప్రతినిధులు, మహిళల హక్కులను షరియా చట్ట పరిధిలోనే గౌరవిస్తామని స్పష్టం చేశారు. దాన్ని ఎంత వరకు అమలు చేస్తారనేది అనుమానమే. మహిళల హక్కులను గౌరవించడం అనేది అసాధ్యమనే అభిప్రాయాలు ఇప్పటికే వ్యక్తమౌతోన్నాయి.

 ఇస్లాం న్యాయవ్యవస్థగా..

ఇస్లాం న్యాయవ్యవస్థగా..

షరియా చట్టాన్ని.. ఇస్లాం న్యాయవ్యవస్థగా చెప్పుకోవచ్చు. ఖురాన్‌లో పొందుపరిచిన అంశాలు, ముస్లి మతపెద్దలు జారీ చేసిన ఫత్వాల ఆధారంగా ఈ చట్టాన్ని రూపొందించారనే అభిప్రాయాలు ఉన్నాయి. ముస్లింలు తమ దినచర్యలో భాగంగా మతాన్ని గౌరవిస్తూ చేపట్టాల్సిన ప్రతి చర్యను ఈ చట్టంలో పొందుపరిచారు. మత పెద్దలు నిర్దేశించిన నియమాలు, రంజాన్ వంటి కొన్ని పండుగ సమయాల్లో పాటించే ఉపవాసాలు, సమాజంలో ముస్లిం మహిళలు ఎలా ఉండాలి అనే విషయాలు ఇందులో ఉంటాయి.

కఠిన నియమాలు..

కఠిన నియమాలు..

మహిళలు బుర్ఖాలు,, పురుషులు పొడుగాటి దుస్తులను ధరించాల్సి ఉంటుందని షరియా చట్టం సూచిస్తుంది. అలాగే పురుషులు గడ్డం గీసుకోకూడదు. వాటిని కఠినంగా అమలు చేయాల్సి ఉంటుంది షరియా చట్టం ప్రకారం. పురుషుల తోడు లేకుండా మహిళలు ఇంటి గడపను దాటకూడదనేది షరియాచట్టంలో పొందుపరిచారు. చోరీలు, మహిళలపై అత్యాచారం, హత్యలకు పాల్పడటం వంటి నేరాలకు అత్యంత కఠినమైన శిక్షలను అమలు చేయాల్సి ఉంటుందని షరియా చట్టం చెబుతుంది.

రెండు దశాబ్దాల కిందటి యాక్ట్..

రెండు దశాబ్దాల కిందటి యాక్ట్..

1996-2001 మధ్య ఆప్ఘనిస్తాన్‌ను పాలించిన తాలిబన్లు మహిళలు చదువుకోవడాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. దీని ప్రభావంతో ఇప్పటికే ఆప్ఘనిస్తాన్‌లోని విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. తాలిబన్‌ ప్రభుత్వ హయాంలో మహిళల విద్యను ఇప్పుడు పునరుద్ధరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి మహిళలకు చదువుకోవడానికి అవకాశం ఇస్తామని తాలిబన్లు ప్రకటించారు. వారి వస్త్రధారణతో పాటు ఇతర అంశాలపై ఆంక్షలు విధించారు. కోఎడ్యుకేషన్‌ను నిషేధించారు. నిఖాబ్‌, స్కార్ఫ్‌ ధరించాలని ఆంక్షలు విధించారు.

మళ్లీ అవే పరిస్థితులు..

మళ్లీ అవే పరిస్థితులు..

ఇప్పుడు మళ్లీ అలాంటి చట్టం ఆఫ్ఘనిస్తాన్‌లో తెరమీదికిరాబోతోండటం ఆ దేశ ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు చేసే వారిపై బుల్లెట్ల వర్షాన్ని కూడా కురిపించడానికి వెనుకాడరు తాలిబన్లు. షరియా చట్టాన్ని అమలు చేస్తామని, తాలిబన్లు అధికారికంగా ప్రకటించడంతో రెండు దశాబ్దాల కిందటి పరిస్థితులు పునరావృతం కానున్నాయి. దీన్ని ఆఫ్ఘనిస్తానీయులు ఎలా ఎదుర్కొంటారు? ఐక్యరాజ్యసమితి దీనిపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.

English summary
New Taliban govt in Afghanistan says it will follow Sharia law like previous regime. Taliban leaders said that will be led by Mullah Mohammad Hasan Akhund, with key roles being given to designated global terrorists, including the dreaded Haqqani Network.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X