వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో డెత్: ఆ దేశాన్ని వణికిస్తోన్న కొత్త వైరస్.. చైనా నుంచేనా..? మిస్టరీ ఏంటి..?

|
Google Oneindia TeluguNews

వియాత్నం: కరోనావైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే పాజిటివ్ వైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండగా మృతుల సంఖ్య కూడా అదే క్రమంలో పెరుగుతున్నాయి. ఇక వియాత్నాం దేశంలో మాత్రం అదేదో అద్భుతం జరుగుతున్నట్లుగా అక్కడ ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా కోవిడ్ ద్వారా సంభవించలేదు. అంతేకాదు స్థానికంగా వ్యాప్తి చెందుతోందని చెప్పేందుకు ఒక్క నిర్థారిత కేసు కూడా లేదు. దీంతో అక్కడి ప్రజలు మాస్కులు తీసేసి బయట తిరుగుతున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా కొత్త వ్యాధి ఇప్పుడు ఆదేశాన్ని వణికిస్తోంది. ఇంతకీ ఆ వ్యాధి ఏంటి..?

MLA wife: 16 ఏళ్లు పిల్లలు లేరు, ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వార్డు పక్కనే కాన్పు, తల్లి, బిడ్డ, సీఎం MLA wife: 16 ఏళ్లు పిల్లలు లేరు, ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వార్డు పక్కనే కాన్పు, తల్లి, బిడ్డ, సీఎం

 వియాత్నాంలో నమోదు కాని కోవిడ్ మరణాలు

వియాత్నాంలో నమోదు కాని కోవిడ్ మరణాలు

వియత్నాం దేశంలో కరోనావైరస్ నియంత్రణలో ఉండటంతో తిరిగి అన్ని తెరుచుకున్నాయి. అక్కడ దుకాణాలు, స్కూళ్లు, పర్యాటక కేంద్రాలు అన్నీ తెరుచుకున్నాయి. దీంతో రద్దీ కూడా పెరిగిపోయింది. దనాంగ్ నగరంలో చూస్తే ప్రజల రద్దీ స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ బీచ్‌లు పర్యాటకులతో నిండిపోయాయి. అంతేకాదు రకరకాల ఆహారాలతో ఆ స్థలాలు తిరిగి అట్రాక్టివ్‌గా మారిపోయాయి. అయితే ఈ వారాంతంలో ఒక వార్త వియత్నాం ప్రజల గుండెల్లో గుబులు పుట్టించింది. గత 100 రోజులుగా కరోనా వైరస్ స్థానికంగా వ్యాప్తి చెందినట్లు ఒక్క కేసు కూడా నిర్థారించబడలేదని చెప్పిన ప్రభుత్వం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి చెందుతోందనే సంచలన ప్రకటన చేసింది. అంతే కాదు ఇది వేగంగా వ్యాప్తి చెందుతోందని వెల్లడించింది.

 దనాంగ్ నగరంలో వైరస్

దనాంగ్ నగరంలో వైరస్

ముందుగా దనాంగ్ నగరంలో ఓ 57 ఏళ్ల వ్యక్తికి కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉండి చికిత్స పొందుతున్నాడు. ఆతర్వాత వైరస్‌తో ఐదు హాస్పిటల్స్‌లో చికిత్స తీసుకునేందుకు ప్రజలు వచ్చారు. బుధవారం నాటికి వైరస్ దేశం ఉత్తరాన రాజధాని హనోయ్ నుంచి దక్షినాన ఉన్న హోచిమిన్ సిటీ వరకు వ్యాపించింది. అంతేకాదు సెంట్రల్ వియాత్నంలోని కొన్ని ప్రావిన్సులతో పాటుగా సెంట్రల్ హైలాండ్స్‌లోని గ్రామీణ ప్రాంతాల వరకు వైరస్ వ్యాపించింది. ఇప్పటి వరకు 450 పాజిటివ్ కేసుల కంటే తక్కువగా నమోదు కాగా ... ప్రస్తుతం వేగంగా వియత్నాంలో కేసులు పెరిగిపోతున్నాయి. వ్యాధి నివారణ చర్యలు కచ్చితంగా చేప్పటిన ప్రాంతాల్లో కూడా కరోనావైరస్ విజృంభిస్తుండటం చూస్తే అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

 వియాత్నంలో విజృంభిస్తున్న వైరస్

వియాత్నంలో విజృంభిస్తున్న వైరస్

ఈ సారి వియాత్నంలో విజృంభిస్తున్న వైరస్ మునపటికంటే చాలా డేంజరస్‌గా ఉందని క్వాంగ్ ట్రుంగ్ యూనివర్శిటీ డీన్ నయన్‌ హుయ్‌ అభిప్రాయపడ్డాడు. ఈ వైరస్ ఒకే సమయంలో చాలా చోట్ల వ్యాప్తి చెందుతోందని చెప్పారు. అయితే ఈ వ్యాధి మూలం ఎక్కడి నుంచి ఉందో అనే విషయం తెలియడం లేదని చెప్పారు. ఇదిలా ఉంటే దనాంగ్ నగరంకు వెళ్లి వచ్చిన వారే ఎక్కువగా కరోనావైరస్ బారిన పడుతుండటంతో తిరిగి కఠిన చర్యలు తీసుకుంది ప్రభుత్వం. మాస్కులు ధరించడం తప్పనిసరిచేసింది. కేసులు వచ్చిన చోట్ల శానిటైజేషన్ చేస్తోంది. పర్యాటక కేంద్రాలను మూసివేయడం జరిగింది. చాలా చోట్లను క్వారంటైన్ సెంటర్లుగా మార్చివేశారు.బుధవారం రోజున మాత్రం బీచ్‌లన్నీ పర్యాటకులు లేక ఎడారిని తలిపించింది.

 జంతువుల రవాణాపై కూడా ఆంక్షలు

జంతువుల రవాణాపై కూడా ఆంక్షలు

వియాత్నం దేశం చైనాతో సరిహద్దు కలిగి ఉంది. అయితే అంతకుముందు వచ్చిన పలు వైరస్‌ల దృష్ట్యా కరోనావైరస్ కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ముందుగానే గ్రహించి వియాత్నం దేశ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది కఠిన చర్యలు అమలు చేసి వ్యాధిని నియంత్రించగలిగింది ఆ ప్రభుత్వం. గత వారం జంతువుల అక్రమ రవాణా పై కూడా ఆంక్షలు విధించింది వియాత్నం ప్రభుత్వం. జంతువుల నుంచి కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నందున ఈ చర్యకు ఉపక్రమించింది.

Recommended Video

Unlock 3.0 : రాత్రి పూట కర్ఫ్యూ ఎత్తివేత | Unlock 3.0 Guidelines ఇవే!! || Oneindia Telugu
 మిస్టరీ ఏంటి..? చైనా నుంచే వచ్చిందా..?

మిస్టరీ ఏంటి..? చైనా నుంచే వచ్చిందా..?

ఇదిలా ఉంటే వైరస్ తిరిగి ఎలా వ్యాప్తి చెందిందనేదానిపై అక్కడి నిపుణులు పరిశోధనలు ప్రారంభించారు. అయితే దనాంగ్‌ నగరంలో కనిపించిన వైరస్ కరోనావైరస్‌లా లేదనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. ప్రజలకు సోకకుండా మూడు నెలల పాటు ఒకే ప్రాంతంలో వైరస్ అనేది ఉండదని ఓ ప్రొఫెసర్ చెప్పారు. ఈ వైరస్ కచ్చితంగా మరో దేశం నుంచి వచ్చిందే అనే అనుమానం ఆయన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు జూన్‌లో కానీ జూలై చివరి వారంలో కానీ ఈ వైరస్ దేశంలోకి ఎంటర్ అయి ఉంటుందనే డౌట్‌ను వ్యక్తం చేశారు. ఇక ఈ కొత్త అనుమానాలతో దనాంగ్ నగర పోలీసులు కొత్త వ్యక్తుల కోసం జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే అక్రమంగా వియాత్నం దేశంలోకి ప్రవేశించిన 9 మంది చైనా దేశస్తులను పోలీసులు గుర్తించారు.ఈ నెల ప్రారంభంలో కూడా 12 మంది చైనా దేశస్తులను పోలీసులు అరెస్టు చేశారు.

మొత్తానికి వియాత్నంలో 95 మిలియన్ జనాభా ఉన్న వియాత్నం దేశంలో ఒక్క కోవిడ్-19 మరణం కూడా సంభవించకపోవడం ఒక రికార్డు అనే చెప్పాలి. కానీ ఉన్నట్లుండి వైరస్ విజృంభిస్తుండటంతో దీని వెనక మిస్టరీ ఏమిటో అంతు చిక్కడం లేదు. పోనీ ఏదైనా కొత్త రకం వైరస్ వియాత్నాంను చుట్టేస్తోందా అనే అనుమానాలు పలువురిలో ఉన్నాయి.

English summary
After months without a single coronavirus death, or even a confirmed case of local transmission, a new outbreak has struck Vietnam. And it’s spreading.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X