మామ్‌పై వెకిలి కార్టూన్: న్యూయార్క్ టైమ్స్ క్షమాపణ
న్యూయార్క్: భారత్ అంగారక గ్రహాన్ని ప్రయోగించడంపై న్యూయార్క్ టైమ్స్ వెకిలి కార్టూన్ వేసింది. ఎలైట్ స్పేస్ క్లబ్‌లో ఇద్దరు వ్యక్తులు కూర్చుని మార్స్ ఆర్బిటర్ మిషన్ ద్వారా ఇండియా సాధించిన విజయాన్ని చదువుతున్నారు. అదే సమయంలో ఓ భారతీయ రైతు, తన ఆవుతో కలిసి ఎలైట్ స్పేస్ క్లబ్‌లో ప్రవేశించేందుకు తలుపు తడుతున్నారు.

భారత్ సాధించిన విజయాన్ని తెలియజేస్తూ ఈ కార్టూన్‌ను న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. సింగపూర్‌కు చెందిన కార్టూనిస్ట్ హెంగ్ కిమ్ సాంగ్ దీన్ని గీశారు. అయితే, దీనిపై పలువురు భారతీయులు పత్రికాయాజమాన్యానికి ఫిర్యాదు చేయటంతో ఎడిటోరియల్ పేజి ఎడిటర్ అండ్రూ రోసెంథాల్ క్షమించాలని కోరుతూ ప్రకటన విడుదల చేశారు.
చివరకు, భారత్ ఉపగ్రహ ప్రయోగాన్ని పరిహసిస్తూ ప్రచురించిన కార్టూన్ వ్యవహారంపై ది న్యూయార్క్ టైమ్స్ క్షమాపణ చెప్ిపంది. భారత్‌ను చిన్న బుచ్చాలనేది తమ అభిమతం కాదని, రోదసీ కార్యక్రమాలు, ప్రయోగాలు ఇప్పుడు ఇక కేవలం సుసంపన్న, పాశ్చాత్య దేశాలకు ప్రత్యేకించిన వ్యవహారమేమీ కాదని మాత్రమే తమ కార్టూన్ ద్వారా తెలియజేయాలని అనుకున్నామని వివరణ ఇచ్చింది.












Click it and Unblock the Notifications