న్యూయార్క్ మోడీ రెండోఇల్లు, లిబర్టీ స్ఫూర్తితోనే 'సర్దార్'
న్యూయార్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అడుగు పెట్టనున్నారు. 2002 తర్వాత మోడీకి అమెరికా వీసా నిరాకరణ తర్వాత ఆయన పర్యటించడం ఇదే మొదటిసారి. కానీ అమెరికా ఆయనకు కొత్త కాదు. అంతేకాదు, న్యూయార్క్ నగరం ఆయనకు రెండో నివాసంగా ఉండేది.

1990లలో న్యూయార్క్ నగరాన్ని మోడీ తన రెండో నివాసం చేసుకున్నారు. అప్పుడు ఆయన విస్తృతంగా పర్యటించారు. బీజేపీలోకి రాకముందు మోడీ ఆరెస్సెస్ ప్రచారక్‌గా ఉండేవారు. అప్పట్లో సంఘ్ పరివార్‌కు ప్రచారం చేసేందుకు, ప్రవాస భారతీయుల మద్దతు కూడగట్టేందుకు మోడీ అమెరికాలో విస్తృతంగా పర్యటించారు.
అప్పట్లో మోడీ న్యూయార్క్‌లోని తమ మిత్రుడు ఇంట్లో ఉంటూ అమెరికాలోని ప్రధాన నగరాల్లో పర్యటించేవారు. న్యూయార్క్ హార్బర్‌లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూసినప్పుడు అలాంటిది భారత్‌లో ఎందుకు ఉండకూడదని ఆయన భావించారు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు గుజరాత్‌లో సర్దార్ పటేల్ ఐక్యతా ప్రతిమ నిర్మాణం ప్రారంభించారు.












Click it and Unblock the Notifications