ఫ్రాన్స్ టెర్రర్ దాడి ఇలా..., ఫ్రెంచ్ వ్యక్తే: భారతీయులు క్షేమం

ప్రాన్స్: ఫ్రాన్సులోని నైస్ నగరంలో దాడికి తామే బాధ్యులమని తీవ్రవాద సంస్థ ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్స్) ప్రకటించింది. మందుగుండు సామాగ్రితో ఉన్న భారీ ట్రక్కును నగరంలో.. బాస్టిల్ డే జరుపుకుంటున్న ప్రజల పైకి డ్రైవర్ తీసుకెళ్లగా 80 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే.

ట్రక్కు నడిపిన టెర్రరిస్ట్ డ్రైవర్‌ను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఈ ఘటన పైన ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండో స్పందించారు. ఫ్రాన్సులో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దేశంలో మూడు నెలల పాటు ఎమర్జెన్సీని పొడిగిస్తున్నట్టు దాడి అనంతరం హోలాండే వెల్లడించారు. ఈ ప్రమాదం పైన అమెరికా డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కూడా స్పందించారు. దీనిని ఆమె తీవ్రంగా ఖండించారు.

ఫ్రాన్స్‌ ఘటనపై మోడీ దిగ్భ్రాంతి

ఫ్రాన్స్‌లోని నైస్‌ నగరంలో జరిగిన ట్రక్కు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది దారుణమైన ఘటన, మతిలేని చర్య అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కష్టాల్లో ఉన్న ఫ్రాన్స్‌ సోదర సోదరీమణులకు భారత్ అండగా నిలుస్తుందన్నారు.

భారతీయులు క్షేమం

ఫ్రాన్స్ తీవ్రవాద దాడి ఘటనలో భారతీయులు ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. దాడి జరిగిన పారిస్‌లోని నైస్ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయులతో రాయబారి టచ్‌లో ఉన్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు. భారత రాయబార కార్యాలయంలో హెల్ప్ లైన్ నంబరు 33-1-40507070ను ప్రారంభించినట్టు పేర్కొన్నారు.

 2 కిలోమీటర్ల మేర జనాన్ని ట్రక్కుతో ఢీకొట్టి..

2 కిలోమీటర్ల మేర జనాన్ని ట్రక్కుతో ఢీకొట్టి..

భారీ ఎత్తున పేలుడు పదార్థాలతో నింపుకున్న పెద్ద ట్రక్కుతో బాస్టిల్ వేడుకలు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్న ఆ ఉగ్రవాది... జనంపైకి వాహనాన్ని దూకించాడు. జనంతో రద్దీగా ఉన్న రోడ్డుపై దాదాపు రెండు కిలో మీటర్ల మేర వాహనాన్ని ఆపకుండా పరుగులు పెట్టించాడు.

2 కిలోమీటర్ల మేర జనాన్ని ట్రక్కుతో ఢీకొట్టి..

2 కిలోమీటర్ల మేర జనాన్ని ట్రక్కుతో ఢీకొట్టి..

ఈ కారణంగానే ట్రక్కు కింద పడి నలిగిపోయిన వారంతా అక్కడికక్కడే చనిపోయారు. ట్రక్కు తగిలి పక్కకు ఎగిరిపడ్డ వారు తీవ్ర గాయాలపాలయ్యారు. వేగంగా ట్రక్కు దూసుకువస్తున్న విషయాన్ని గమనించిన వారంతా ప్రాణభయంతో పరుగులు తీశారు.

2 కిలోమీటర్ల మేర జనాన్ని ట్రక్కుతో ఢీకొట్టి..

2 కిలోమీటర్ల మేర జనాన్ని ట్రక్కుతో ఢీకొట్టి..

రెండు కిలో మీటర్ల దాకా వాహనంతో వేగంగా దూసుకువెళ్లిన ఉగ్రవాది.. తాను ముందుగా నిర్దేశించుకున్న ప్రదేశంలో ట్రక్కును ఆపేసి సమీపంలోని రెస్టారెంట్‌లోకి చొరబడ్డాడు. పోలీసులు అతనిని మట్టుబెట్టారు.

 డ్రైవర్ ఫ్రెంచ్ వ్యక్తి

డ్రైవర్ ఫ్రెంచ్ వ్యక్తి

ట్రక్కు నడిపిన వ్యక్తి ఫ్రెంచ్ వాసేనని, అతని వయసు 31 సంవత్సరాలని అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఐడెంటిటీ పేపర్లను ట్రక్కులో కనుగొన్నామని వివరించారు. ఉగ్రవాద వ్యతిరేక విభాగం విచారణ చేపట్టిందన్నారు. మృతుల్లో చిన్నారుల సంఖ్య అధికంగా ఉండటం తనను కలచివేస్తోందని, గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

ఇలా మట్టుబెట్టారు

ఇలా మట్టుబెట్టారు


రోడ్డును వదిలి ప్రజలు నడుస్తున్న ఫుట్ పాత్ పైకి ఎక్కిన ట్రక్కు మారణహోమం సృష్టిస్తూ దూసుకుపోతుండగా... దానిని చూసిన భద్రతాదళం వెంటనే స్పందించింది. అప్పటికే ట్రక్కును చూసిన పోలీసులు తుపాకులతో కాల్పులు జరిపారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఫోటోలను పరిశీలిస్తే... ట్రక్కు ముందుభాగమంతా బులెట్ల వర్షంలో పూర్తిగా దెబ్బ తిన్నది.

 ఇలా మట్టుబెట్టారు

ఇలా మట్టుబెట్టారు

ట్రక్కు టైర్లు పేలిపోయి ఉన్నాయి. పోలీసులు ముందుగా టైర్లను పేల్చేసేందుకే ప్రయత్నించారని, టైర్లపై బులెట్ల వర్షం కురిపించినప్పటికీ, అది ఆగలేదని తెలుస్తోంది. టైర్లన్నీ పేలిపోయి ట్రక్కు కదలని స్థితిలో ఉండటమో లేక తాను నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరుకున్నాకనో.. దానిని వదిలిన టెర్రరిస్ట్ ఓ రెస్టారెంటులోకి వెళ్లాడు. దానిని చుట్టుముట్టిన పోలీసులు అతన్ని కాల్చి చంపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+