ఇక కరోనా పని పట్టడమే ఆలస్యం: ఆ మెడిసిన్‌తో వేగంగా కోలుకుంటోన్న పేషెంట్లు: ఎన్ఐహెచ్ వెల్లడి

న్యూయార్క్: కరోనా వైరస్‌‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన రెమిడిసివిర్ మెడిసిన్ సత్ఫలితాలను ఇస్తోంది. అమెరికాలో కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌ విజయవంతమైనట్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) వెల్లడించింది. ఇదివరకు ప్లాసెబొతో రూపొందించిన డ్రగ్ లేదా మెడిసిన్‌తో చికిత్స చేసిన కరోనా పేషెంట్ల కంటే రెమిడిసివిర్‌తో వైదం చేసిన బాధితులే శరవేగంగా కోలుకుంటున్నారని ప్రకటించింది.

Recommended Video

    COVID 19 Patients Recovered Faster With Remdesivir Than Placebo NIH says
    అంచనాలకు మించిన ఫలితాలు..

    అంచనాలకు మించిన ఫలితాలు..

    రెమిడిసివిర్ ద్వారా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం ఇది రెండోసారి. వారం రోజుల కిందటే తొలిసారిగా క్లినికల్ ట్రయల్స్ చేపట్టారు. తొలి ప్రయత్నం విఫలం అయింది. అనంతరం దీన్ని మరింత అభివృద్ధి చేశారు. కరోనా పేషెంట్లపై ప్రయోగించారు. రెండోసారి చేపట్టిన క్లినికల్ ట్రయల్స్ ఇదివరకటి కంటే మంచి ఫలితాలను ఇచ్చిందని ఎన్ఐహెచ్ పేర్కొంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్ఐఏఐడీ)తో కలిసి సంయుక్తంగా ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. తమ అంచనాలకు మించిన స్థాయిలో ఫలితాలు వచ్చాయని పేర్కొంది.

    తొలి ప్రయత్నంలో విఫలం..

    తొలి ప్రయత్నంలో విఫలం..

    గిలీడ్ సైన్స్ అనే చైనాకు చెందిన ఫార్మాసూటికల్స్ సంస్థ తయారు చేసిన ఈ మెడిసిన్‌ ఇది. తొలి ప్రయత్నంలో.. కరోనా వైరస్ సోకిన 237 మంది పేషెంట్లకు రెమిడిసివిర్ ద్వారా వైద్యాన్ని అందించాలని నిర్ణయించారు. అనంతరం వారిని వడపోశారు. 158 మందిని ఎంపిక చేశారు. వారిలో 79 మందికి రెమిడిసివిర్ ద్వారా వైద్యాన్ని అందించారు. వాటి ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. రెమెడిసివిర్‌ను అందించిన వారిలో 13.9 శాతం పేషెంట్లు మరణించారు. అదే సమయంలో ప్లాసెబోలో 12.8 శాతం పేషెంట్ల ఆరోగ్యం మెరుగుపడినట్లు గుర్తించారు.

    ప్లాసెబొ కంటే 31 శాతం వేగంగా..

    ప్లాసెబొ కంటే 31 శాతం వేగంగా..

    ప్లాసెబొతో ట్రీట్‌మెంట్ చేసిన కరోనా వైరస్ పేషెంట్ల కంటే 31 శాతం వేగంగా రెమిడిసివిర్ పని చేస్తోందని ఎన్ఐహెచ్, ఎన్ఐఏఐడీ వెల్లడించాయి. ప్లాసెబొతో వైద్యం చేసిన పేషెంట్లు 15 రోజుల్లో కోలుకుంటోండగా.. రెమిడిసివిర్ వల్ల 11 రోజుల్లోనే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని స్పష్టం చేశాయి. వైద్యశాస్త్రంలో ప్రతి క్షణం విలువైనదిగా భావించే పేషెంట్ జీవితంలో అయిదు రోజుల కాలం చాలా విలువైనదని పేర్కొన్నాయి. మొత్తం 1063 మంది కరోనా వైరస్ పేషెంట్లపై రెమిడిసివిర్ ద్వారా క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించామని తెలిపాయి.

    శరీరంలో వైరస్ ప్రభావాన్ని తగ్గిస్తోందంటూ..

    శరీరంలో వైరస్ ప్రభావాన్ని తగ్గిస్తోందంటూ..

    రెమిడిసివిర్‌ను ప్రయోగించిన తరువాత పేషెంట్ శరీరంలో కరోనా వైరస్ ప్రభావాన్ని గణనీయంగా ఇది తగ్గిస్తోందని ఎన్ఐఏఐడీ డైరెక్టర్ ఆంథొని ఎస్ ఫ్యూసీ తెలిపారు. ప్రస్తుతం 31 శాతం వరకే ప్రభావాన్ని చూపిస్తోందని, దీన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామని, ఈ ప్రయత్నాలు మొదలయ్యాయని అన్నారు. త్వరలోనే వందశాతం వైరస్‌ను నిర్మూలించేలా ఈ మెడిసిన్‌ను తయారు చేస్తామని అన్నారు. మరిన్ని క్లినికల్ ట్రయల్స్‌ను తాము చేపట్టాల్సి ఉందని చెప్పారు.

    ఫిబ్రవరి 21 నుంచి క్లినికల్ ట్రయల్స్

    ఫిబ్రవరి 21 నుంచి క్లినికల్ ట్రయల్స్

    ఈ ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ నుంచి తాము రెమిడిసివిర్‌ ద్వార క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహిస్తున్నట్లు ఫ్యూసీ తెలిపారు. 1063 మందిలో దశలవారీగా ఈ మెడిసిన్‌ను ఎక్కించామని, దాని ఫలితాలు తాము అంచనా వేసినదాని కంటే మెరుగ్గా ఉన్నాయని అన్నారు. అడాప్టివ్ కోవిడ్-19 ట్రీట్‌మెంట్ ట్రయల్ (ఏసీటీటీ) పేరుతో తాము ఈ ట్రయల్స్ చేపట్టినట్లు వెల్లడించారు. వివిధ దశల్లో అనారోగ్యానికి గురైన కరోనా పేషెంట్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా.. దాదాపు అందరి ఆరోగ్యం మెరుగుపడిందని ఆయన స్పష్టం చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+