అమేరికాలో మరోసారి కాల్పులు 9మంది మృతి..16 మందికి గాయాలు...!
అమేరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది.టెక్సాస్‌లోని వాల్‌మార్ట్‌లోని కాల్పులు జరిగిన సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఓహియో ప్రాంతంలో మరో దుండగుడు రెచ్చిపోయాడు. ఓహియో ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో అక్కడికక్కడే 9 మంది మృత్యువాత పడగా మరో 16 మంది పౌరులు గాయపడినట్టు తెలుస్తోంది. ఇక కాల్పులు జరిపిన దుండగుడుని పోలీసులు మట్టుబెట్టినట్టు సమాచారం.

కాగా ఓహియో ప్రాంతం పూర్తిగా పర్యటక ప్రాంతంగా ఉండడంతో అక్కడ ఎక్కువగా రెస్టారెంట్స్,బార్స్‌తోపాటు ఇతర పర్యటక రంగ వసతులతో కిటకిటలాడుతుంది. మరోవైపు ఈ సంఘటనలో గాయపడిన 16మందిని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు అంతకు ముందు మూడు రోజుల క్రితమే ఓ యువకుడు కాల్పులు జరిపడంతో ముగ్గురు పౌరులు చనిపోయినట్టు సమాచారం.అయితే కాల్పులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications