నేపాల్ లో మళ్లి భూకంపం: హడలిపోతున్న ప్రజలు
ఖాట్మండు: నేపాల్ ప్రజల మీద దేవుడు కరుణించినట్లు లేదు. వారం రోజుల నుండి అతలాకుతలం అయిన నేపాల్ లో సరిగ్గా వారం రోజుల తరువాత అదే రోజు మళ్లి భూకంపం రావడంతో స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. అధికారులు ముందు జాగ్రత చర్యలు తీసుకుంటున్నారు.
శనివారం (మే 2వ తేది) రిక్టర్ స్కేల్ పై భూప్రకంపనల తీవ్రత 4.5 గా నమోదు అయ్యిందని అధికారులు వెళ్లడించారు. మరోసారి భూమి కంపించవచ్చని అధికారులు హెచ్చరించిన నేపద్యంలో అక్కడి ప్రజలు ఇండ్లలో నుండి బయటకు వచ్చి బిక్కుబిక్కు మంటు కాలం వెల్లదీస్తున్నారు.
చలి, ఎండ, వానలు లెక్క చెయ్యకుండ నిర్జనప్రదేశాలలో బ్రతుకులు వెల్లదీస్తున్నారు. భూకంప మృతుల సంఖ్య 6,621కి చేరిందని, మృతదేహాలు బయటకు తీశామని, ఇప్పటి వరకు 14,023 మంది గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని నేపాల్ ప్రభుత్వం వెల్లడించింది.

భూకంపం సంభవించి మే 2వ తేదికి వారం రోజులు అయ్యిందని, శిథిలాల కింద చిక్కుకున్న వారు బ్రతికే అవకాశాలు చాల తక్కువగా ఉన్నాయని నేపాల్ ప్రభుత్వ ప్రతినిధి లక్ష్మీ ప్రసాద్ అంటున్నారు. త్వరలో పరిస్థితిని చక్కదిద్దుతామని ఆయన చెప్పారు.
ఇప్పటి వరకు 20 దేశాల నుండి వచ్చిన వైద్య బృందాలు, సహాయక బృందాలు బాధితులకు సేవలందిస్తున్నారని లక్ష్మీ ప్రసాద్ అన్నారు. గురువారం నుండి ఇప్పటి వరకు శిథిలాల కింద సజీవంగా ఉన్న వారిని బయటకు తియ్యలేదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications