పాక్‌పై మాట మార్చిన చైనా, మేం దాడి చేస్తే భారత్ కోలుకోలేదన్న డ్రాగన్

Posted By:
Subscribe to Oneindia Telugu

బీజింగ్: పాకిస్థాన్‌పై చైనా మాట మార్చింది. పాక్‌పై గతంలో ఉన్న విధానానికే కట్టుబడి ఉంటామని చైనా ప్రకటించింది. చైనా ఈ హమీ ఇవ్వడంతో పాకిస్థాన్‌ ఊపిరి పీల్చుకొంది.

కిమ్‌కు చైనా షాక్: సరిహద్దులో మిలటరీ డ్రిల్, ఉ.కొరియాకు దెబ్బేనా?

బ్రిక్స్ దేశాల సదస్సులో ఉగ్రవాదానికి ఊతమిస్తుందనే నెపంతో చైనా తీవ్రంగా పాక్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.బ్రిక్స్ డిక్లరేషన్ తర్వాత చైనా విధానాల్లో మార్పులు వస్తాయని పాకిస్థాన్ ఆందోళన చెందింది.

కిమ్ ఆస్తులపై అమెరికా కన్ను: ఉ.కొరియాపై ట్రంప్ మరిన్ని ఆంక్షలు

కానీ, పాకిస్థాన్ ఆందోళనలకు చైనా తెరదించింది. పాక్‌తో చైనా సన్నిహితంగా ఉంటోంది. అయితే పాక్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కూడ చైనా ప్రతినిధి బృందం హజరైంది.

ట్రంప్‌కు జింగ్‌పిన్ ఫోన్, ఉ.కొరియాపై అగ్రదేశాల వ్యూహమిదే!

పాక్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా చైనా, పాక్ మధ్య వాణిజ్య, రక్షణ విషయాలపై రెండు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. రెండు దేశాల మధ్య స్నేహ వాతావరణం కొనసాగించాలని అభిప్రాయపడ్డాయి రెండు దేశాలు.

పాక్‌పై మాటమార్చిన చైనా

పాక్‌పై మాటమార్చిన చైనా

పాక్‌పై గతంలో అనుసరించిన విధానాన్నే కొనసాగిస్తామని చైనా ప్రకటించింది. పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంస్థలను గతంలోనే నిషేధించిన విషయాన్ని పాక్‌లో చైనా రాయబారిగా వ్యవహరిస్తున్న సన్‌‌వైడింగ్ గుర్తుచేశారు. బ్రిక్స్ సదస్సులో తీవ్రవాదంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.

చైనా- పాక్ బంధం విడిపోదు

చైనా- పాక్ బంధం విడిపోదు

. చైనా- పాక్ బంధం విడిపోదన్నారు పాక్‌లో చైనా రాయబారి సన్ వైడింగ్, ప్రాంతీయ సవాళ్ళను ఎదుర్కోవడంలో ఇరు దేశాలకు ఒకరికొకరు సహకారం తీసుకోవడం అత్యవసరమన్నారాయన. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు పాక్ చిత్తశుద్దితో ప్రయత్నిస్తోందని ఆయన కొనియాడారు.పాక్‌పై చైనా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.

రావత్ వ్యాఖ్యలతో భారత్ ఇమేజ్‌కు దెబ్బ

రావత్ వ్యాఖ్యలతో భారత్ ఇమేజ్‌కు దెబ్బ

ఇండియాకు రెండు పొరుగు దేశాల నుంచి ముప్పు పొంచి వుందని, ఒకేదఫా చైనా, పాకిస్థాన్ లతో యుద్ధం చేయాల్సి రావచ్చని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై చైనా తీవ్రంగా స్పందించింది. బిపిన్ రావత్ నోరు ఎంతో చేటు చేయనుందని చైనా, భారత్ ల మధ్య వాతావరణం చెడిపోనుందని చైనా అధికార మీడియా 'గ్లోబల్ టైమ్స్' వ్యాఖ్యానించింది. తన సంపాదకీయంలో "రావత్ అహంకార పూరిత వ్యాఖ్యలతో భారత ఇమేజ్ దెబ్బతింటోందని ఆ పత్రిక అభిప్రాయపడింది. .

చైనా, పాక్‌లు దాడిచేస్తే భారత్ తట్టుకోలేదు

చైనా, పాక్‌లు దాడిచేస్తే భారత్ తట్టుకోలేదు

చైనా పాకిస్థాన్ లు ఒకేసారి భారత్ పై పడితే ఆ దేశం తట్టుకోలేదని గ్లోబల్ టైమ్స్ అభిప్రాయపడింది. అదే జరిగితే ఇండియా తీవ్రంగా నష్టపోక తప్పదని హెచ్చరించింది. ప్రస్తుతం తమ దేశ పరిస్థితి ఎలా వుందన్న కనీస విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా భారత సైన్యాధికారులు మాట్లాడుతున్నారని ఆరోపించింది. ఇటువంటి మాటలు మాట్లాడేముందు చైనా సైనిక బలంతో ఓసారి పోల్చుకున్నారా? అని ప్రశ్నించింది. సరిహద్దుల విషయంలో భారత్ తో గొడవలు వద్దని చైనీయులు భావిస్తున్నారని, అయితే, జనరల్ రావత్ చేసిన కామెంట్లు చైనీయులకు తప్పుడు సంకేతాలు పంపాయని పేర్కొంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Beijing has assured Pakistan that there is "no change" in its policy, days after BRICS nations at a summit in China named groups operating from Pakistani soil - Lashkar-e-Taiba, Jaish-e-Mohammed and the Haqqani network - in a strongly-worded declaration condemning terror.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి