రన్ వేపై విమానాలు ఢీకొని రెక్కలు తెగిపడ్డాయి, కానీ
టోరంటోలో రెండు విమానాలు రన్ వే పైన ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.రన్ వే పైన విమానాల రెక్కలు ఒకదానికి ఒకటి తగిలి బాగా దెబ్బతిన్నాయి.
టోరంటో: టోరంటోలో రెండు విమానాలు రన్ వే పైన ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. రన్ వే పైన విమానాల రెక్కలు ఒకదానికి ఒకటి తగిలి బాగా దెబ్బతిన్నాయి.
ఈ ప్రమాదంలో విమానాలు బ్బతిన్నప్పటికీ ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదు. పోలాండ్‌కు చెందిన బోయింగ్ 787 విమానం టొరంటోలోని విమానాశ్రయంలో రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధమవుతోంది.

అదే సమయంలో కెనడాకు చెందిన ఎయిర్ కెనడా విమానం ల్యాండ్ అయి ముందుకు వస్తోంది. ఈ సమయంలో రెండు విమానాల రెక్కలు ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో విమానాలు బాగా దెబ్బతిన్నాయి. అయితే ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఒక్కో విమానంలో 200కుపైగా ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications