కాశ్మీర్‌పై మమ్మల్ని ఆపే శక్తి ఈ భూమ్మీద దేనికీ లేదు: షరీఫ్ సంచలనం
కరాచీ: కాశ్మీర్ ప్రాంత ప్రజలకు మద్దతు ఇవ్వకుండా ఈ భూమి మీద తమను ఏ శక్తి ఆపలేదని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన కాశ్మీర్ వేర్పాటువాది బుర్హన్ వానికి పలుమార్లు మద్దతు పలికిన విషయం తెలిసిందే. కాశ్మీర్ అంశంపై కూడా మాట్లాడాడు.
తాజాగా, మరోసారి కాశ్మీర్ పైన కీలక వ్యాఖ్యలు చేశాడు. కాశ్మీరీలకు సాయం చేయకుండా ఈ భూమి మీద తమన ఏ శక్తి అడ్డుకోదన్నాడు. కాశ్మీరులు చేస్తున్న స్వాతంత్ర్య పోరాటాన్ని భారత్ ఉగ్రవాదంగా భావిస్తోందని చెప్పాడు. ఆయన ఈ రోజు పాకిస్తాన్ ముస్లీం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) సెంట్రల్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడాడు.

ప్రముఖ రెబల్ లీడర్ బుర్హన్ వానిని చంపేసిన తర్వాత భారత దళాలు వందమంది కాశ్మీరీ నిరసనకారులను మట్టుబెట్టాయని ఆరోపించారు. ఈ ఘటనతో రెండు అణుసామర్థ్యం కలిగిన దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయన్నారు. ఉగ్రవాదం సహా దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను అధిగమిస్తామన్నారు. చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్‌తో ఎక్కువగా లాభపడేది బెలూచిస్తాన్ అన్నారు. తమ ప్రభుత్వ పాలసీల వల్ల ఆర్థిక ప్రగతి సాధించామన్నారు.












Click it and Unblock the Notifications