భారత్‌లో మత స్వేచ్ఛ లేదు! ముస్లింలు, క్రైస్తవులకు రక్షణ లేదు: అమెరికా తీవ్ర ఆరోపణ

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్‌: భారత్‌‌పై అమెరికా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. భారత్‌లో మత స్వేచ్ఛ లేదని, మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాయని ఆరోపించింది. ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవులకు భారత్‌లో రక్షణ లేదంటూ వ్యాఖ్యానించింది.

మైనారిటీలపై దాడులు చేసి బెదిరిస్తున్నది హిందువులేనని స్పష్టంగా పేర్కొంది. అంతేకాదు, భారత్‌లో మత స్వేచ్ఛను ప్రోత్సహిస్తామంటూ తనదైన శైలిలో దాతృత్వం చాటుకుంది.

No Religious Freedom in India, No protection for Muslims and Christians, America Slams India

దాదాపు 5 లక్షల డాలర్ల నిధులు ఇందుకు కేటాయించినట్లు పేర్కొంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వేతర సంస్థలకు అంటే ఎన్జీవోలకు అందజేయనుంది. సమాజాన్ని, జర్నలిస్ట్‌లను చైతన్య పర్చడం, మత స్వేచ్ఛను కాపాడటం, మత సంబంధ దాడులపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం, చట్టం ఏం చెబుతుంది, మానవహక్కులు ఏమిటో చెప్పడం ఈ మిషన్‌లో భాగమని అమెరికా వెల్లడించింది.

ఇంటర్నేషనల్‌ రెలిజియస్‌ ఫ్రీడమ్‌ రిపోర్ట్‌ ప్రకారం.. భారత్‌, శ్రీలంక దేశాల్లో క్రైస్తవులు, ముస్లింలపై ఎక్కువుగా దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని గుర్తించినట్టు అమెరికా వెల్లడించింది.

దక్షిణ, మధ్య ఆసియా దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘన, కార్మికుల రక్షణ తదితర 28 అంశాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు అమెరికా ప్రకటించింది. ఇందుకోసం 17 మిలియన్‌ డాలర్లు కేటాయించింది.

విచిత్రం ఏమంటే....అమెరికా నిధులు అందజేస్తున్న దేశాల జాబితాలో భారత్‌ లేదు. అయినా సరే పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయడం.. విమర్శలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.

ఆఫ్గనిస్థాన్‌, బంగ్లాదేశ్‌, కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, నేపాల్‌, పాకిస్తాన్‌, తజకిస్థాన్‌, తుర్కుమెనిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ మాత్రమే అమెరికా నిధులు అందే జాబితాలో ఉన్నాయి. అయితే భారత్‌తోపాటు శ్రీలంకకు కూడా ఇదే విషయంలో భారీగా నిధులు అందజేయబోతున్నట్టు అమెరికా ప్రకటించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
America slamed India over religious freedom. It says that there is no religious freedom in India and america made allegations that there is no protection to Muslims and Christians in India. According to the USCIRF report, American came to this conclusion. And it is telling that it is sanctioned 5 Lakh dollars to Indian NGOs to correct the situation.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి