బలంగా ఢీకొని అల్జీరియా విమానం ముక్కలు ముక్కలు!
అల్జీర్స్: అత్యవసరంగా ల్యాండ్ అవుతుండగా ప్రమాదం బారినపడిన అల్జీరియా విమానం పైన దర్యాప్తు చేపట్టిన అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం నిపుణులు ఓ అంచనాకు వచ్చారు. ఆఫ్రికాలోని ఉత్తర మాలిలో రెండు రోజుల క్రితం జరిగిన అల్జీరియా విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న నిపుణులు... విమానం చాలా బలంగా నేలను ఢీకొట్టడంతోపాటు గాలిలోకి ఎగిరిపడి ఉంటుందని భావిస్తున్నారు.
అందుకే ముక్కలుముక్కలై అర కిలోమీటరు పరిధిలో శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా మృత్యువాతపడ్డారు. కొన్ని కుటుంబాలకు చెందిన వారంతా దుర్మరణం పాలయ్యారు.

ఫ్రాన్స్‌కు చెందిన ఒక కుటుంబంలోని 10 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు. కాలిపోయి, ఛిద్రమైన మృతుల అవయవాలు మాత్రమే లభ్యంకావడంతో మృతదేహాలను గుర్తించడం కుదరడం లేదంటున్నారు.
ప్రతికూల వాతావరణం వల్లే పైలట్ విమానాన్ని దారి మళ్లించి ఉండవచ్చునని చెబుతున్నారు. విమానం అంత బలంగా నేలను ఎందుకు ఢీకొట్టిందో తేలాల్సి ఉందంటున్నారు. విమాన శకలాల నుంచి రెండో బ్లాక్‌బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరణించిన వారిలో బర్కినా ఫాసో, లెబనాన్, అల్జీరియా, స్పెయిన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్‌లకు చెందినవారు ఉన్నారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications