లేబర్ ఎకనమిక్స్‌లో అద్భుత ప్రయోగాలు: ఆర్థిక శాస్త్రంలో ఆ ముగ్గురికీ నోబెల్

స్టాక్‌హోమ్: వేర్వేరు రంగాలకు చెందిన శాస్త్రేవేత్తలు, ఆర్థికవేత్తలు, ఇతర సామాజిక ఉద్యమకారులకు ప్రతి సంవత్సరం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతుల ప్రకటనలు కొనసాగుతున్నాయి. తొలిరోజు మెడిసిన్, ఆ తరువాత ఫిజిక్స్.. ఇలా వరుసగా ఒక్కో రంగానికి చెందిన శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజులను ప్రకటించింది. తాజాగా- ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించింది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్.

ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రానికి కు సంబంధించిన నోబెల్ అవార్డుల కోసం ముగ్గురిని ఎంపిక చేసింది. డేవిడ్ కార్డ్, జోషువా డీ యాంగ్రిస్ట్, గైడో డబ్ల్యూ ఇంబెన్స్‌ల పేర్లను ప్రకటించింది. ఈ ముగ్గురూ వేర్వేరు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు. డేవిడ్ కార్డ్ స్వదేశం కెనడా. జోషువా డీ యాంగ్రిస్ట్ ఇజ్రాయెలీ-అమెరికన్. జన్మతః ఆయన ఇజ్రాయెలీ అయినప్పటికీ.. అమెరికాలో స్థిరపడ్డారు. గైడో డబ్ల్యూ ఇంబెన్స్ డచ్-అమెరికన్. ఈ ముగ్గురికీ జాయింట్‌గా ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించింది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్యానెల్ కమిటీ.

Nobel Prize 2021 for economic has been awarded in David Card, Joshua D Angrist and W Imbens

లేబర్ ఎకనమిక్స్‌లో అద్భుతమైన ప్రయోగాలను చేపట్టినందు వల్ల డేవిడ్ కార్డ్‌ను ఎంపిక చేసినట్లు తెలిపింది. అమెరికాలోని బర్కెలీలో గల యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఆయన ఎకనమిక్స్ ప్రొఫెసర్. కనీస వేతనాలు, వలసలు, విద్య వంటివి లేబర్ మార్కెట్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయనే విషయంపై ఆయన ప్రయోగాలు చేశారు. ఆర్థికశాస్త్రంలో మెథడలాజికల్ కంట్రిబ్యూషన్ చేసినందుకు జోషువా డీ యాంగ్రిస్ట్, గైడో డబ్ల్యూ ఇంబెన్స్‌ను ఎంపిక చేశారు.

ఆర్థికశాస్త్రంలో భారత్‌కు రెండు సార్లు నోబెల్ బహుమతి లభించిన విషయం తెలిసిందే. ఇదివరకు 1998లో ఆమర్త్యసేన్‌కు ఆర్థికశాస్త్రంలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు. ఆ తరువాత 2019లో అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తేర్ డఫ్లో సంయుక్తంగా ఇదే కేటగిరీలో నోబెల్ బహుమతి కోసం ఎంపికయ్యారు. తమ కొలీగ్ మైఖెల్ క్రెమెర్‌తో కలిసి ఈ అవార్డును పంచుకున్నారు. గత ఏడాది స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ ఎకనమిస్ట్స్ పాల్ ఆర్ మిల్‌గ్రోమ్, రాబర్ట్ బీ విల్సన్‌ల పేర్లను ప్రకటించింది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+