Noida Twin Towers: కుప్పకూలిన నోయిడా ట్విన్ టవర్స్.. సైరన్ మోగిన సెకన్లలో నేలమట్టం.. వీడియో చూసేయండి..
Noida Twin Towers: నోయిడాలోని సూపర్‌టెక్ ట్విన్ టవర్లను (ఎమరాల్డ్ కోర్ట్‌లోని అపెక్స్ అండ్ సెయాన్ టవర్లు) కూల్చివేత అధికారుల సమక్షంలో ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు పూర్తయ్యింది. ఉదయం 7 గంటలకల్లా చుట్టుపక్క ప్రాంతాలను ఖాళీ చేయించే పనిని అక్కడి అధికారులు పూర్తి చేశారు. సుమారు 3700 కిలోల పేలుడు పదార్థాలకు వినియోగించి కేవలం సెకన్ల వ్యవధిలోనే ఈ ఆకాశహరమ్యాన్ని అధికారులు కుప్పకూల్చారు.
అదికారుల సమక్షంలో..
ఈ పనిని సురక్షితంగా పూర్తి చేసే బాధ్యతను ముంబయికి చెందిన ఎడిఫైస్ ఇంజినీరింగ్ తీసుకుంది. దక్షిణాఫ్రికా నిపుణులైన జెట్ డిమోలిషన్స్‌ను ప్రాజెక్ట్ కోసం నియమించటం జరిగింది. వాహనాలతో సహా చుట్టుపక్కల ఇళ్లవారు ఖాళీ చేయాలని అధికారులు చెప్పటంతో ఆందోళనకు గురయ్యారు. పెయింటింగ్ పై పగుళ్లు తప్ప వారి నివాసాలకు ఎలాంటి నష్టం వాటిల్లదని హామీ ఇచ్చారు. NDRF బృందాలు కూడా ముందుగా పేలుడు ప్రాంతానికి చేరుకుని అవసరమైన చర్యలు చేపట్టాయి.

నిర్మాణం వివరాలు..
సూపర్ టెక్ లిమిటెడ్ కంపెనీకి 2004లో స్థలం కేటాయించబడింది. 2011లో రెసిడెంట్ వెల్ఫేర్ దీనిపై కోర్టును ఆశ్రయించింది. దేశ రాజధానిలోని కుతుబ్ మినార్ కంటే ఎత్తైన టవర్లలో ఎమరాల్డ్ కోర్ట్‌లో భాగమైన అపెక్స్ (32 అంతస్తులు), సెయానే (29 అంతస్తులు) ఉన్నాయి. వీటి నిర్మాణానికి సంబంధించి అనేక నిబంధనలను ఉల్లంఘించినట్లు దర్యాప్తులో తేలింది. దీని తరువాత సుదీర్ఘ న్యాయ పోరాటం జరిగింది. అలహాబాద్ హైకోర్టులో, ఆ తర్వాత భారత సుప్రీం కోర్టులో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు పోరాటానికి అనుకూలంగా తీర్పు రావటంతో చివరికి ఈరోజు నేలమట్టమైంది.
పొల్యూషన్ పై డాక్టర్ల మాటేంటి..
అలాంటి పెద్ద నిర్మాణాన్ని కూల్చివేసినప్పుడు పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నందున దుమ్ము, కొంత పొగ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో గాలి దిశ చాలా కీలకమని ఫోర్టిస్ నోయిడా పల్మోనాలజీ అండ్ క్రిటికల్ కేర్ హెడ్ డాక్టర్ మృణాల్ సిర్కార్ అన్నారు. అయితే భూగర్బ గనుల్లో చేపట్టే పేలుళ్లకంటే బహిరంగ ప్రదేశంలో పేలుడు సంభవించడం చాలా సురక్షితమైనదని అన్నారు. అయితే పేలుడు తర్వాత ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు అధికారులు ప్రత్యేక పరికరాన్ని ఏర్పాటు చేశారు.

కంపనాలు..
ఇంత భారీ భవనాన్ని నేలమట్టం చేసేందుకు పేలుళ్లను జరుపుతున్నందున కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు తెలుస్తోంది. ఇది చుట్టుపక్కల కొన్ని మీటర్ల పరిథిలో ఉంటుందని అంటున్నారు. ఈ పేలుళ్ల వల్ల టన్నుల కొద్ది వ్యర్థాలు అక్కడ పోగుబడ్డాయి. ప్రస్తుతం నిలిచిపోయిన వంటగ్యాస్ సరఫరా సాయంత్రం 4 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఇందులో ఉన్న 915 ఫ్లాట్లను అమ్మిఉంటే కంపెనీకి దాదాపు రూ.1,200 కోట్ల లాభం వచ్చి ఉండేది. అయితే ఇప్పటికే అడ్వాన్సులు చెల్లించిన 633 మంది రూ.180 కోట్లు నష్టపోయారు.












Click it and Unblock the Notifications