అమెరికాలో హిందూ ఆలయ బోర్డుపై బుల్లెట్ల వర్షం
హ్యూస్టన్: అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రం ఫోర్సిత్ పట్టణంలో హిందూ దేవాలయం నిర్మించనున్న స్థలంలోని సైన్‌బోర్డుపై గుర్తుతెలియని వ్యక్తులు షాట్‌గన్‌తో 60 బుల్లెట్లు కురిపించారు. ఈ సంఘటనపై ఆ ప్రాంతంలో నివసించే హిందువులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
కాగా, జులై తొలివారంలో దుండగులు ఆ బోర్డుకు తూట్లు పొడిచారని, దీనిపై దర్యాప్తు ప్రారంభించామని పట్టణ షెరీఫ్ (పాలకుడు) కార్యాలయ అధికారి తెలిపారు.

‘నార్త్ కరోలినా ఓం హిందూ ఆర్గనైజేషన్' ఇక్కడ 7.6 ఎకరాల స్థలం కొనుగోలు చేసి అందులో 3,600 చదరపు అడుగుల మేర ఆలయ నిర్మాణం తలపెట్టింది. దుండగులు విద్వేష ప్రదర్శనకు పాల్పడినప్పటికీ ఆలయ నిర్మాణం ఆపేది లేదు' అని ఈ సందర్భంగా సంస్థ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications