ఎక్కడ?: సరిగ్గా కూర్చోలేదని ఉపప్రధానిని ఉరి తీశారు
సియోల్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ఉన్ నియంతృత్వం గురించి ప్రపంచానికి తెలిసిన విషయమే. రానురాను అతని పైశాచికత్వానికి అంతేలేకుండా పోతోంది. చిన్నచిన్న కారణాలతోనే ఉన్నతాధికారులను, బంధువులను కూడా ఉరితీసి తన పైశాచికాన్ని చాటుకుంటున్నాడు.
తాగా, తన అధికారంపై మరింత పట్టును పెంచుకునేందుకు ఉప ప్రధానిని కూడా ఉరితీసినట్లు తెలిసింది. అది కూడా ఓ చిన్న కారణానికే కావడం గమనార్హం.

ఆ వివరాల్లోకి వెళితే.. కిమ్ జోంగ్ ఉన్ అధ్యక్షతన జరిగిన ఓ సమావేశంలో ఉప ప్రధాని సక్రమంగా కూర్చోలేదని ఆయనను కూడా ఉరితీసినట్లు దక్షిణకొరియా మీడియా బుధవారం వెల్లడించింది. గత జూలైలో ఉప ప్రధాని కిమ్‌యాంగ్‌జిన్‌ను బహిరంగంగా ఉరితీయించారని పేర్కొంది.
కిమ్‌జోంగ్ ఉన్ అధ్యక్షతన జరిగిన ఓ ఉన్నతస్థాయి సమావేశంలో ఉప ప్రధాని కిమ్‌యాంగ్‌జిన్ అసభ్యకరమైన రీతిలో కుర్చీలో కూర్చున్నారంటూ వెంటనే అతడిని అరెస్ట్ చేసి విచారణకు ఆదేశించారు.
ఆ తర్వాత అతనిపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని, దేశంలో విప్లవాన్ని లేవదీస్తున్నాడని అభియోగాలు మోపీ మరణశిక్ష విధించారని దక్షిణకొరియా మీడియా తెలిపింది. ఇదే ఆరోపణలపై ఇద్దరు సీనియర్ అధికారులను కూడా పదవి నుంచి తొలగించి వారికి మరణశిక్షను అమలు చేశారని తెలిపింది. గతంలో కూడా చాలా మంది అధికారులను, బంధువులను కూడా మరణశిక్ష విధించాడు ఉన్.












Click it and Unblock the Notifications