వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెనక్కి తగ్గని ఉత్తర కొరియా, జపాన్ దిశగా.. మళ్లీ నాలుగు క్షిపణుల ప్రయోగం

ఉత్తర కొరియా వెనక్కి తగ్గడం లేదు.. క్షిపణిప్రయాగాలను ఆపడం లేదు. తాజాగా సోమవారం నాలుగు ఖండాంతర క్షిపణులను జపాన్ వైపు ప్రయోగించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ప్యాంగ్ యాంగ్: ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్నా.. అగ్రరాజ్యం అమెరికా కన్నెర్ర చేస్తున్నా.. దుందుడుకు ఉత్తర కొరియా వెనక్కి తగ్గడం లేదు.. తన క్షిపణిప్రయాగాలను ఆపడం లేదు. తాజాగా సోమవారం ఉదయం నాలుగు ఖండాంతర క్షిపణులను జపాన్ వైపు ప్రయోగించింది.

వీటిలో మూడు క్షిపణులు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి జపాన్ ఎక్స్ క్లూజివ్ ఎకనమిక్ జోన్(ఈఈజెడ్)లో పడ్డాయి. ఈ క్షిపణి ప్రయోగాలను దక్షిణ కొరియా, అమెరికా నిశితంగా పరిశీలిస్తున్నాయి.

ఆంక్షలు ఉన్నప్పటికీ...

ఆంక్షలు ఉన్నప్పటికీ...

ఈ క్షిపణుల ప్రయోగాన్ని.. ముప్పులో మరో దశగా జపాన్ ప్రధాని షింజో అబె అభివర్ణించారు. చైనా సరిహద్దు సమీపంలోని తాంగ్ చాంగ్-రి ప్రాంతం నుంచి వీటిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా రక్షణ శాఖ వెల్లడించింది.

ఉత్తర కొరియా ఎలాంటి క్షిపణిని ప్రయోగించకూడదని ఇప్పటికే ఐక్యరాజ్య సమితి ఆంక్షలు ఉన్నాయి. అయినప్పటికీ ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది.

స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 7.36 గంటలకు ఈ ప్రయోగం జరిగినట్లు దక్షిణ కొరియా రక్షణశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఏ రకం క్షిపణిని ప్రయోగించారో విచారణ జరుపుతున్నామన్నారు.

చూస్తున్నాం.. దిస్ ఈజ్ బ్యాడ్

చూస్తున్నాం.. దిస్ ఈజ్ బ్యాడ్

మరోవైపు ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగాలను తామూ గుర్తించామని, అయితే దీనివల్ల ఉత్తర అమెరికాకు ఎలాంటి ముప్పు లేదని అమెరికా రక్షణశాఖ పేర్కొంది. అయితే ఈ ప్రయోగాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాల ఉల్లంఘనే అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మార్క్ టోనర్ అన్నారు. దక్షిణ కొరియా, జపాన్ కూడా ఈ ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించాయి.

అదే కారణమా?

అదే కారణమా?

దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా ఫోల్ ఈగల్ మిలిటరీ కసరత్తు నిర్వహించడంపై ఉత్తర కొరియా మండిపడుతోంది. ఈ మిలిటరీ కసరత్తు తమ దేశంలో చొరబాటుకేనని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో తాము క్షిపణులు ప్రయోగిస్తామని గత శుక్రవారం హెచ్చరించింది కూడా. ఈరోజు ఆ పని చేయనే చేసింది.

రోజురోజుకీ పదునెక్కుతూ...

రోజురోజుకీ పదునెక్కుతూ...

కొన్నాళ్లుగా వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న ఉత్తర కొరియా.. ప్రతి ప్రయోగానికి మరింత మెరుగవుతూ వస్తోందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాను కూడా తాకగలిగే ఖండాంతర క్షిపణులను అభివృద్ధి చేస్తున్నట్లు కూడా ఉత్తర కొరియా ఇప్పటికే స్పష్టం చేసింది.

గత నెలలో ఈ ఖండాంతర క్షిపణి ప్రయోగాన్ని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్వయంగా పరిశీలించిన సంగతి విదితమే. అయితే క్షిపణుల ద్వారా ప్రయోగించగలిగే న్యూక్లియర్ వార్ హెడ్స్ తయారీలో మాత్రం ఉత్తర కొరియా ఇంకా వెనుకబడే ఉంది.

English summary
North Korea fired four ballistic missiles in the early hours of Monday morning, in what Japan's leader described as "an extremely dangerous action."Military authorities in South Korea, Japan and the United States all confirmed the launch of four projectiles, which traveled almost 1,000 kilometers (620 miles) towards the Sea of Japan, also known as the East Sea. One US official said they were intermediate range missiles. Three landed inside Japan's exclusive economic zone, Prime Minister Shinzo Abe said, which extends 200 nautical miles from its coastline according to international maritime law. The launch underscored the rapid evolution of North Korea's missile program, which experts say has begun moving at a faster rate to develop and deploy missiles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X