వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: నేడే కిమ్ కీలక ప్రకటన,ఉ.కొరియా భారీ ప్లాన్, ఏం జరుగుతోంది?

ఉత్తరకొరియా కీలకమైన ప్రకటన చేయనుంది. ఈ మేరకు ఉ.కొరియా రేడియో ఈ విషయాన్ని ప్రకటించింది. నవంబర్ 29,వ తేది మధ్యాహ్నం మూడున్నర గంటలకు కీలకమైన ప్రకటన చేయనున్నట్టు ఆ దేశ రేడియో ప్రకటించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

సియోల్: ఉత్తరకొరియా కీలకమైన ప్రకటన చేయనుంది. ఈ మేరకు ఉ.కొరియా రేడియో ఈ విషయాన్ని ప్రకటించింది. నవంబర్ 29,వ తేది మధ్యాహ్నం మూడున్నర గంటలకు కీలకమైన ప్రకటన చేయనున్నట్టు ఆ దేశ రేడియో ప్రకటించింది.

ట్రంప్‌కు షాక్: ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన కిమ్, అమెరికాలో ఎక్కడైనా దాడి?ట్రంప్‌కు షాక్: ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన కిమ్, అమెరికాలో ఎక్కడైనా దాడి?

ఉత్తరకొరియా తాజాగా ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ఈ ప్రయోగంతో అమెరికాలో ఎక్కడికైనా ఉత్తరకొరియా తాను అనుకొన్న లక్ష్యాన్ని చేధించే అవకాశం ఉంటుంది.

షాక్: వైట్‌హౌస్ సహ 15 ప్రాంతాల్లో అణుదాడికి కిమ్ ప్లాన్షాక్: వైట్‌హౌస్ సహ 15 ప్రాంతాల్లో అణుదాడికి కిమ్ ప్లాన్

ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. అదే సమయంలో ఐక్యరాజ్యసమితి భద్రతా కౌన్సిల్ అత్యవసరంగా సమావేశం కానుంది. అదే సమయంలో ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగంపై చర్చించే అవకాశం ఉంది.

కిమ్‌కు ట్రంప్ షాక్: ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న జాబితాలో ఉ.కొరియా, ఆంక్షలు?కిమ్‌కు ట్రంప్ షాక్: ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న జాబితాలో ఉ.కొరియా, ఆంక్షలు?

 కీలక ప్రకటన చేయనున్న ఉత్తరకొరియా

కీలక ప్రకటన చేయనున్న ఉత్తరకొరియా

ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగం చేసింది. ఈ ప్రయోగంతో కొరియా వ్యతిరేక దేశాలు భయాందోళనలను వ్యక్తం చేస్తున్నాయి.అయితే అదే తరుణంలో మరో కీలకమైన ప్రకటన చేయనున్నట్టు ఉత్తరకొరియా ప్రపంచ దేశాలను భయబ్రాంతులకు గురిచేసింది. నవంబర్ 29, తేది మధ్యాహ్నం మూడున్నర గంటలకు కీలకమైన ప్రకటన చేయనున్నట్టు ఉత్తరకొరియా రేడియో ప్రకటించింది. అసలు ఈ కీలకమైన ప్రకటన ఏమిటనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉత్తరకొరియా భవిష్యత్ ప్లాన్ గురించే ఈ ప్రకటన సారాంశంగా ఉండే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మళ్ళీ రెచ్చిపోతున్న కిమ్

మళ్ళీ రెచ్చిపోతున్న కిమ్

రెండు మాసాలుగా ఎలాంటి చడీ చప్పుడు లేకుండా ఉన్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మళ్ళీ రెచ్చిపోతున్నారు. అణు పరీక్షలు, ఖండాంతర క్షిపణుల పరీక్షలు నిర్వహిస్తూ రెండు మాసాల క్రితం జపాన్, దక్షిణ కొరియా, అమెరికాలకు నిద్ర లేకుండా చేశాడు కిమ్. అయితే కిమ్ రెండు మాసాలుగా ప్రశాంతంగా ఉండడం పట్ల ప్రపంచ దేశాలు ఊఫిరి పీల్చుకొన్నాయి. కానీ, మళ్ళీ కిమ్ రెచ్చిపోతున్నారు. ఖండాంతర క్షిపణి పరీక్ష నిర్వహించి మరోసారి భయాన్ని రగిల్చారు. అయితే కిమ్ ఏం ప్రకటన చేస్తారోననేది ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.

 సిఐఏ అంచనా కరెక్టే

సిఐఏ అంచనా కరెక్టే

రెండు మాసాలుగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగకపోవడంతో ఏదో భారీ ప్లాన్ వేసి ఉంటాడని అమెరికాకు సిఐఏ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సిఐఏ వర్గాల అనుమానం నిజమైంది. రెండు మాసాలుగా కిమ్ జంగ్ ఉన్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పకపోవడం వెనుక ఏదో ప్లాన్ ఉండి ఉంటుందని సిఐఏ అభిప్రాయపడింది. ఈ అనుమానాలు నిజమయ్యాయి. తాజాగా కిమ్ ఖండాంతర క్షిపణిని ప్రయోగించాడు.

 అమెరికాను రెచ్చగొట్టే ప్రకటన ఉంటుందా

అమెరికాను రెచ్చగొట్టే ప్రకటన ఉంటుందా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియా వేదికగా చేసుకొని కిమ్ జంగ్ ఉన్‌పై తీవ్రమైన విమర్శలకు దిగారు. ఆసియా దేశాల పర్యటనను ముగించుకొని వచ్చిన తర్వాత ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న దేశాల జాబితాలో ఉత్తరకొరియా పేరును అమెరికా చేర్చింది. దీంతో ఉత్తరకొరియాపై ఆంక్షలు తీవ్రమయ్యాయి. ఈ తరుణంలోనే ఖండాంతర క్షిపణి ప్రయోగం చేసినట్టు ఉత్తరకొరియా ప్రకటించింది. అయితే అమెరికాను లక్ష్యంగా చేసుకొనే కిమ్ కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

English summary
North Korea said it would make an "important announcement" on Wednesday, South Korea's Yonhap news agency reported, after Pyongyang staged its first missile launch in more than two months. Pyongyang's state-run radio station said the announcement would be made at 0330 GMT without providing details, Yonhap said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X