ఉ. కొరియాలో పెను ప్రమాదం కుప్పకూలిన నూక్లియర్ బేస్, 200మంది మృతి
ఉత్తరకొరియాలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. పుంగ్గే-రీ ప్రాంతంలో ఉన్న అణుప్రయోగ స్థలంలోని ఓ భారీ సొరంగం కుప్పకూలింది. ఈ ఘటనలో 200 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం జపా
ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియాలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. పుంగ్గే-రీ ప్రాంతంలో ఉన్న అణుప్రయోగ స్థలంలోని ఓ భారీ సొరంగం కుప్పకూలింది. ఈ ఘటనలో 200 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం జపాన్ మీడియా వెలుగులోకి తెచ్చింది.
జపాన్ మీడియా కథనం ప్రకారం.. అక్టోబర్ 10న మిలిటరీ సైట్ వద్ద నిర్మాణ పనులు చేపడుతుండగా ఒక్కసారిగా సొరంగం కూలిపోయింది. దీంతో సొరంగంలో 100 మంది చిక్కుకుపోయారు.

ఈ సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని చర్యలు చేపడుతుండగా మిగిలిన భాగం వారిపై కూలిపోయింది. దీంతో మరో 100 మంది కూడా మృత్యువాతపడ్డారు. అంతేగాక, రేడియో ధార్మిక లీకేజీ కూడా సంభవించిందని సమాచారం.
అయితే, ఈ పెను ప్రమాదంపై ఇప్పటివరకు ఉత్తర కొరియా అధికారులు స్పందించకపోవడం గమనార్హం. ఇటీవల ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబ్‌ను పరీక్షించడంతో ఆ ప్రదేశం మొత్తం దెబ్బతింది. దీంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందని జపాన్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications