• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉ కొరియాలో కరోనా కల్లోలం - తొలి మరణం: 3.5 లక్షల మంది క్వారంటైన్ : కిమ్ సంచలన నిర్ణయాలు..!!

|
Google Oneindia TeluguNews

ప్రపంచం మొత్తం కరోనాతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న వేళ కరోనా ఫ్రీ దేశంగా ఉత్తర కొరియా నిలిచింది. కానీ, ఇప్పుడు పరిస్థితి ఒక్క సారిగా మారిపోయింది. కోవిడ్ ఇప్పుడు ఉత్తర కొరియాను కుదిపేస్తోంది. ఒక్క కేసు వెలుగులోకి రావటంతో..దేశాధినేత సంచలన కిమ్​ జోంగ్​ ఉన్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఒక్క రోజులోనే 18వేల మందిలో జ్వరం లక్షణాలు గుర్తించినట్లు ఆ దేశ అధికార మీడియా వెల్లడించింది. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రాజధాని ప్యాంగాంగ్‌లో జర్వంతో మొత్తం ఆరుగురు మరణించారని, వారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. ఒకిరికి ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్లుగా నిర్దారించారు. మొత్తంగా 3.5 లక్షల మందిని క్వారంటైన్ లో ఉంచారు.

క్వారంటైన్ లో 3.5 లక్షల మంది

క్వారంటైన్ లో 3.5 లక్షల మంది

ఏప్రిల్​ చివరి వారం నుంచి ఇప్పటివరకు 3.5 లక్షల మంది జ్వరపీడితులుగా మారినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా కొరియన్​ సెంట్రల్​ న్యూస్​ ఏజెన్సీ వెల్లడించింది. ఒక్కరోజే 18,000 మందిలో జ్వరం లక్షణాలు కనిపించినట్లు పేర్కొంది. వారందరినీ ఐసోలేషన్​కు తరలించి చికిత్స అందిస్తున్నామని పేర్కొంది. కరోనా ఉద్భవించిన రెండేళ్ల తర్వాత ఉత్తర కొరియాలో తొలి కేసు నమోదు కావటంతో..వెంటనే అధ్యక్షుడు దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధిస్తూ ఆదేశాలు జారీ చేసారు. అయితే, ఉత్తర కొరియాలో పలువురి ఒమిక్రాన్​ వేరియంట్ బారిన పడినట్లుగా కధనాలు వస్తున్నాయి.

వైరస్ దేశ వ్యాప్తంగా వ్యాప్తి - చికిత్స

వైరస్ దేశ వ్యాప్తంగా వ్యాప్తి - చికిత్స

దీనికి ప్రధాన కారణాల పైన విశ్లేషణలు మొదలయ్యాయి. ఏప్రిల్​ 25న పెద్ద ఎత్తున నిర్వహించిన మిలిటరీ పరేడ్​ కారణంగానే వైరస్ వ్యాప్తి జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల పైన అధ్యక్షుడు కిమ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నియంత్రణ ప్రధాన కేంద్రాన్ని సందర్శించారు. వైరస్​ కట్టడిలో విఫలమయ్యారని అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా ఉద్ధృతి సమయంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని కొవాక్స్​ నుంచి టీకాలు తీసుకునేందుకు నిరాకరించిన ఉత్తర కొరియా ప్రస్తుతం విదేశాల నుంచి సాయం అందుకునేందుకు సిద్దపడినట్లుగా తెలుస్తోంది.

లాక్ డౌన్ అమలు..కిమ్ కీలక ఆదేశాలు

లాక్ డౌన్ అమలు..కిమ్ కీలక ఆదేశాలు

ఉత్తర కొరియాకు వైద్య సాయంతో పాటు ఇతర సహాయం అందించేందుకు దక్షిణ కొరియా సిద్ధంగా ఉందని ఆ దేశ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉత్తర కొరియన్లు ఇప్పటివరకు కరోనా టీకా తీసుకోలేదు. మహమ్మారిని అడ్డుకోవడానికి తాము టీకాలు అందిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో, రష్యా, చైనా ప్రకటించినప్పటికీ.. కిమ్‌ తిరస్కరించారు. వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి కిమ్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి, లాక్‌డౌన్‌ విధించి..కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.

English summary
North Korea announced its first Covid-19 death, saying that 187,000 people were being "isolated and treated" for fever as it confirmed the virus had spread nationwide
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X