ట్రంప్‌కు షాక్: వరుస ఉపగ్రహల ప్రయోగం, కిమ్ నెక్ట్స్ ప్లాన్ ఇదే
సియోల్:ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మరో ఆసక్తికరమైన చర్యకు శ్రీకారం చుట్టనున్నారని దక్షిణ కొరియా దేశం అభిప్రాయపడుతోంది. దక్షిణ కొరియాకు చెందిన నిఘావర్గాలకు అందిన సమాచారం మేరకు ఉత్తరకొరియా వరుసగా ఉపగ్రహలను అంతరిక్షంలోకి పంపేందుకు ప్లాన్ చేస్తోందని సమాచారం.
వరుస అణుపరీక్షలు, క్షిపణి పరీక్షలతో ప్రపంచదేశాలను భయబ్రాంతులకు గురిచేసిన ఉత్తరకొరియా.. మరో సంచలనానికి తెరతీసింది.ఉత్తరకొరియాకు కళ్లెం వేసేందుకు అమెరికా అన్ని రకాల ప్రయత్నాలను ప్రారంభించింది.
ఐక్యరాజ్యసమితి సహకారంతో ఉత్తరకొరియాపై ఆంక్షలను విధించారు. ఉత్తరకొరియా ప్రపందేశాల హెచ్చరికలను ఖాతరు చేయకుండా వ్యవహరించిన కారణంగానే ఆంక్షలను విధించాల్సి వచ్చిందని అమెరికా గుర్తు చేస్తోంది.

ఉపగ్రహల ప్రయోగం కోసం ఉత్తరకొరియా ప్లాన్
అంతరిక్షంలోకి వరుసగా ఉపగ్రహలను పంపేందుకు ఉత్తరకొరియా ప్లాన్ చేస్తోందని దక్షిణకొరియా నిఘా వర్గాలు ప్రకటించాయి.తమకు కూడ ఉపగ్రహాలను ప్రయోగించే హక్కు ఉందని ఉత్తరకొరియా అధికార పత్రిక కథనం ప్రచురించడాన్ని దక్షిణ కొరియా నిఘావర్గాలు ప్రస్తావిస్తున్నాయి.

త్వరలోనే ఉపగ్రహ ప్రయోగం
ఉత్తరకొరియా త్వరలోనే క్వాంగ్‌యాంగ్‌సాంగ్-5 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించే అవకాశం ఉందని దక్షిణ కొరియా ప్రకటించింది.ఈ మేరకు దక్షిణకొరియాలోని మీడియా ఈ అంశాన్ని ప్రకటించింది.

ఆంక్షలతో ఇబ్బందేనా
ఇప్పటికే ఐక్యరాజ్యసమితి ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించింది. వరుస అణుపరీక్షలు, క్షిపణి పరీక్షల కారణంగా ఉత్తరకొరియాపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలను విధించింది.ఈ ఆంక్షల కారణంగా ఉత్తరకొరియాకు ఉపగ్రహలను ప్రయోగించే అవకాశం లేదు.ఈ ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఉత్తరకొరియా త్వరలోనే ఉపగ్రహలను పరీక్షించే అవకాశం ఉందని దక్షిణ కొరియా నిఘా వర్గాలు చెబుతున్నాయి.

వరుస ఉపగ్రహలకు ఉత్తరకొరియా ప్లాన్
వరుసగా ఉపగ్రహలను ప్రయోగించేందుకు ఉత్తరకొరియా ప్లాన్ చేస్తోందని దక్షిణ కొరియా నిఘా వర్గాలకు సమాచారం అందింది.ఈ మేరకు ఉపగ్రహలను వరుసగా ప్రయోగించేందుకు ఉత్తరకొరియా ప్లాన్ చేసిందని దక్షిణ కొరియా ప్రకటిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో యూఎన్ సమావేశంలో మాట్లాడిన కిమ్ దేశ ప్రతినిధి ఉత్తరకొరియా ప్రజల సంక్షేమం కోసం, ఆర్థిక ప్రగతి కోసం ఉపగ్రహ ప్రయోగాలను చేయనుందని ప్రకటించారు.భారీగా కెమెరాలు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలను అమర్చిన ఉపగ్రహాన్ని ఆర్బిట్‌లో ప్రవేశపెట్టడానికి ఉత్తరకొరియా సిద్ధమౌతోందని దక్షిణ కొరియా నిఘావర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications