వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్‌కు ట్రంప్ షాక్: 'ఉత్తర కొరియాను నాశనం చేస్తాం, యుద్దం కోరుకొంటుంది'

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణిని ప్రయోగించడంపై అమెరికా తీవ్రంగా మండిపడింది.నిజంగా యుద్ధమే జరిగితే.. ఉత్తర కొరియాను నామరూపాల్లేకుండా చేస్తామని అమెరికా తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది.ఉత్తరకొరియాను నిలువరించేందుకు అన్ని రకాల మార్డాల్లో ప్రయత్నాలను సాగిస్తున్నామని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది.

షాక్: నేడే కిమ్ కీలక ప్రకటన,ఉ.కొరియా భారీ ప్లాన్, ఏం జరుగుతోంది?షాక్: నేడే కిమ్ కీలక ప్రకటన,ఉ.కొరియా భారీ ప్లాన్, ఏం జరుగుతోంది?

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఆదేశం మేరకు రెండు రోజుల క్రితం ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ఈ క్షిపణి అత్యంత శక్తివంతమైంది. ఉత్తరకొరియా నుండి ఏ క్షణంలోనైనా అమెరికాలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి చేధించే శక్తి ఉంది.

ట్రంప్‌కు షాక్: ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన కిమ్, అమెరికాలో ఎక్కడైనా దాడి?ట్రంప్‌కు షాక్: ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన కిమ్, అమెరికాలో ఎక్కడైనా దాడి?

ఈ క్షిపణి ప్రయోగం తర్వాత ప్రపంచ దేశాలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తరకొరియా తీరును పలు దేశాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ తరుణంలో అమెరికా కూడ ఉత్తరకొరియా తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉంది.

ఉత్తరకొరియాను నాశనం చేస్తాం

ఉత్తరకొరియాను నాశనం చేస్తాం

ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణిని పరీక్షించడంపై అమెరికా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఉత్తర కొరియా అధినాయకత్వం యుద్ధాన్ని కోరుకుంటున్నట్లు కనిపిస్తోందని అమెరికా అభిప్రాయపడింది. నిజంగా యుద్ధమే జరిగితే.. ఉత్తర కొరియాను నామరూపాల్లేకుండా చేస్తామని అమెరికా తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలను బట్టి చూ,స్తే ఉత్తరకొరియాపై అమీతుమీకి అమెరికా కూడ సిద్దంగానే ఉందని తేటతెల్లమౌతోంది.

సైనిక చర్యకు కూడ రెఢీ

సైనిక చర్యకు కూడ రెఢీ

ఉత్తర కొరియాను నిరోధించేందుకు అన్నిమార్గాల్లోనూ ప్రయత్నాలు చేస్తున్నామని అమెరికా ప్రకటించింది. అందులో సైనిక చర్య కూడా ఒక భాగమని ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ స్పష్టం చేసింది. ఉత్తర కొరియా తన అణుకార్యక్రమానికి ఫుల్‌స్టాప్‌ పెట్టకపోతే పరిస్థితులు మరింత దిగజారే అవకాశముందని ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రకటించింది.

యుద్దం చేయాల్సిన పరిస్థితులు కల్పిస్తోన్న ఉత్తరకొరియా

యుద్దం చేయాల్సిన పరిస్థితులు కల్పిస్తోన్న ఉత్తరకొరియా

ఉత్తరకొరియాపై యుద్దం చేయాలనే ఆలోచన తమకు లేదని అమెరికా ప్రకటించింది. అయితే ఉత్తరకొరియా వ్యవహరిస్తున్న తీరుతో యుద్దం చేయాల్సి వస్తోందని అమెరికా అభిప్రాయపడింది. ఈ క్షణం వరకూ ఉత్తర కొరియాపై యుద్ధం చేయాలన్న ఆలోచన లేదన్నారు. అయితే ఇప్పుడు పునరాలోచించుకోవాల్సి వస్తోందని అమెరికా రాయబారి నిక్కీహేలీ అన్నారు.

ముడి చమురు సరఫరాను నిలిపివేయాలి

ముడి చమురు సరఫరాను నిలిపివేయాలి

ఒకవేళ యుద్ధమే జరిగితే అమెరికా మరోసారి తప్పు చేయదని అమెరికా రాయబారి నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు.ఉత్తర కొరియాను పూర్తిగా నాశనం చేస్తామని నిక్కీ హేలీ హెచ్చరించారు. ఉత్తర కొరియాను దిగ్భందించే పనిలో భాగంగా మరిన్ని ఆంక్షలను సైతం విధిస్తామని ఆమె ప్రకటించారు. ఇదిలా ఉంటే ఉత్తరకొరియాకు ముడి చమురు సరఫరాను పూర్తిగా నిలిపివేయాలని చైనాను అమెరికా కోరింది. ఈ విషయంపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ట్రంప్‌ బుధవారం ఫోన్‌లో మాట్లాడినట్లు నిక్కీ హేలీ తెలిపారు.

English summary
A Republican senator who once helped take down a strongman opposed to the U.S. has said the life of North Korean leader Kim Jong Un is in danger, asserting that the young head of state's days would be numbered if he doesn't stop launching missiles and testing nuclear weapons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X