అదంతా తప్పుడు ప్రచారం, రెచ్చగొట్టేందుకే, ప్రతీకారచర్యలు తప్పవు: కిమ్

Posted By:
Subscribe to Oneindia Telugu

ప్యాంగ్యాంగ్: వాన్నా క్రై ర్యాన్సమ్‌వేర్‌ సైబర్ దాడికి ఉత్తరకొరియా పాల్పడిందనే ఆరోపణలను ఆ దేశం తీవ్రంగా ఖండించింది.తమ దేశంపై అమెరికా తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఉత్తరకొరియా విదేశాంగ మంత్రిత్వశాఖ తేల్చి చెప్పింది.

షాక్: 'వాన్నా క్రై ర్యాన్సమ్‌వేర్ ' దాడి వెనుక కిమ్: అమెరికా

వాన్నా క్రై ర్యాన్సమ్ వేర్ సైబర్ దాడికి ఉత్తరకొరియా పూనుకొందని అమెరికాకు చెందిన ఓ మీడియాలో కథనం వెలువడింది. ఈ విషయమై వైట్ హౌజ్ కూడ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని ఆ కథనాన్ని ప్రచురించింది.

అమెరికాతో చర్చలకు ఉ.కొరియా సై: అగ్రరాజ్యం మెలిక, చొరవ చూపిన రష్యా

ఈ కథనంపై ఉత్తరకొరియా తీవ్రంగా మండిపడింది. తప్పుడు ఆరోపణలు మానుకోవాలని ఉత్తరకొరియా తీవ్రంగా అమెరికాపై మండిపడింది. ఈ తరహ పద్దతులకు స్వస్తి పలకాలని ఉత్తరకొరియా తేల్చి చెప్పింది.

కిమ్‌కు షాక్: ఆ భయంతో సైనికుల పరార్, అంతు చిక్కని వ్యాధులు

వాన్నాక్రై ర్యాన్సమ్‌వేర్‌‌కు సంబంధం లేదు

వాన్నాక్రై ర్యాన్సమ్‌వేర్‌‌కు సంబంధం లేదు

వాన్నాక్రై ర్యాన్సమ్ వేర్ సైబర్ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఉత్తరకొరియా తేల్చి చెప్పింది. తమపై నిందారోపణలను మానుకోవాలని అమెరికాకు సూచించింది. కుట్రపూరితంగానే తమ దేశంపై అమెరికా ఆరోపణలు చేస్తోందని ఉత్తరకొరియా విదేశాంగ మంత్రిత్వశాఖ హెచ్చరించింది.

 ఉద్రిక్తతలు రెచ్చగొట్టేటా

ఉద్రిక్తతలు రెచ్చగొట్టేటా

వాన్నాక్రై ర్యాన్సమ్ వేర్ దాడులకు తాము పాల్పడ్డామని అమెరికా చేసిన ఆరోపణలు అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయని ఉత్తరకొరియా అభిప్రాయపడింది. తమ దేశంపై బురదచల్లేందుకే అమెరికా ఈ తరహ తప్పుడు ప్రచారం చేస్తోందని ఉత్తరకొరియా ఆరోపణలు చేసింది.

 ప్రతీకార చర్యలకు వెనుకాడం

ప్రతీకార చర్యలకు వెనుకాడం

తప్పుడు ప్రచారం చేస్తే ప్రతీకార చర్యలకు తాము వెనుకాడబోమని కూడ ఉత్తరకొరియా హెచ్చరించింది. ఈ తరహ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని ఉత్తరకొరియా అమెరికాకు సూచించింది. లేకపోతే అమెరికాకే నష్టం వాటిల్లుతోందని హెచ్చరించింది.

 చూస్తూ ఊరుకోం

చూస్తూ ఊరుకోం

అమెరికా తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకొనే ప్రసక్తేలేదని ఉత్తరకొరియా ప్రకటించింది.తాడో పేడో తేల్చుకొంటామని హెచ్చరించింది. ఉద్రిక్తతలను పెంచిపోషించేలా అమెరికా వ్యవహరిస్తోందని ఉత్తరకొరియా అభిప్రాయపడింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
North Korea has described a US accusation that it was behind a ransomware attack as a "grave political provocation" and vowed to retaliate.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి