వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచం ముందుకు మాన్‌స్టర్ మిస్సైల్: మూడో ప్రపంచ యుద్ధానికి కిమ్‌ సన్నాహాలు చేస్తున్నారా?

|
Google Oneindia TeluguNews

ప్యాంగ్యాంగ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచదేశాలన్నీ తీవ్రంగా సతమతమౌతున్నాయి. రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి పాశ్చాత్య దేశాలన్నీ ఏకం అయ్యాయి. ఇది కాస్తా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందనే ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమౌతున్నాయి. ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకున్నా, భద్రతమండలి వారించినా, అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించినా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. మెట్టు దిగట్లేదు.

అంతా నార్మల్: చైనా మంత్రితో జైశంకర్, అజితో ధోవల్ భేటీ: ఉక్రెయిన్, ఆఫ్ఘనిస్తాన్‌పైఅంతా నార్మల్: చైనా మంత్రితో జైశంకర్, అజితో ధోవల్ భేటీ: ఉక్రెయిన్, ఆఫ్ఘనిస్తాన్‌పై

హ్వాసాంగ్ 17

హ్వాసాంగ్ 17

ఇదంతా ఒక ఎత్తయితే.. ఉత్తర కొరియా నియంత కిమ్‌జొంగ్ ఉన్- చేపడుతోన్న వరుస క్షిపణి ప్రయోగాలు మరో ఎత్తుగా మారాయి. తాజాగా ఉత్తర కొరియా చేపట్టిన ఖండాంతర క్షిపణి ప్రయోగం పొరుగు దేశాలను కలవరపాటుకు గురి చేసింది. ఖండాంతర క్షిపణి హ్వాసాంగ్-17ను ఉత్తరకొరియా తాజాగా ప్రయోగించింది. ఖండాలను దాటుకుని వెళ్లి.. మరీ లక్ష్యాన్ని ఛేదించడం ఈ మాన్‌స్టర్ క్షిపణి ప్రత్యేకత. పొరుగునే ఉన్న దక్షిణ కొరియా, జపాన్ మాత్రమే కాకుండా.. అటు అమెరికా సైతం ఈ క్షిపణి ప్రయోగం పట్ల ఉలిక్కిపడింది.

స్వయంగా పర్యవేక్షించిన కిమ్

స్వయంగా పర్యవేక్షించిన కిమ్

ఈ మిస్సైల్ ప్రయోగాన్ని కిమ్ జాంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. తన ఆయుధ
సంపత్తిని ప్రపంచ దేశాలకు తెలియజేయడానికే ఉత్తర కొరియా- ఈ వీడియోను విడుదల చేసినట్లు మీడియా అభిప్రాయపడుతోంది. ప్రపంచ యుద్ధమే గనక వస్తే- తన సత్తా ఇదీ అని చాటి చెప్పేలా ఆయన ఈ తరహా అత్యాధునిక క్షిపణి ప్రయోగాలకు పూనుకుంటున్నారని అంచనా వేస్తోంది.

ఖండాంతర లక్ష్యాలు సైతం..

ఖండాంతర లక్ష్యాలు సైతం..

న్యూక్లియర్ మల్టిపుల్ వార్ హెడ్లను మోసుకుపోయే సామర్థ్యం గల హ్వాసాంగ్ 17 క్షిపణి ప్రయోగం పట్ల దక్షిణ కొరియా, జపాన్, అమెరికా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ మధ్యకాలంలో బాల్లిస్టిక్ క్షిపణులను ప్రయోగానికి ఉత్తర కొరియా పాల్పడుతోందని, మరో అడుగు ముందుకేసి ఖండాంతర మిస్సైల్‌ను టెస్ట్ ఫైర్ చేయడాన్ని క్షమించలేమని జపాన్ పేర్కొంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ఉత్తరకొరియా ధిక్కరిస్తోందంటూ అమెరికా అభ్యంతరం తెలిపింది.

అయిదేళ్ల తరువాత..

ఖండాంతర క్షిపణిని ప్రయోగించడం ఉత్తర కొరియాకు ఇదే తొలిసారి. అయిదు సంవత్సరాల కిందట అంటే- చివరిసారిగా 2017లో ఈ తరహా మిస్సైల్‌ను పరీక్షించింది. తాజాగా ప్రరీక్షించిన హ్వాసాంగ్ మిస్సైల్.. 1,080 కిలోమీటర్లు ప్రయాణించి జపాన్‌ సముద్ర జలాల్లో పడినట్లు దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీన్ని అసాధారణ క్షిపణి పరీక్షగా అభివర్ణించింది. అత్యంత శక్తిమంతమైనదని, దాదాపు 6,200 కిలోమీటర్లు ఎత్తున, 71 నిమిషాల పాటు ప్రయాణించినట్లు తెలిపింది.

అమెరికా ఆందోళనకు

అమెరికా ఆందోళనకు

ఈ క్షిపణి పరీక్షతో అమెరికా ఆందోళన వ్యక్తం చేయడానికి కారణాలు లేకపోలేదు. దీనితో- ఆ దేశంలోని ఏ ప్రాంతంలోని లక్ష్యాన్నయినా ఛేదించే అవకాశం ఉంది ఉత్తర కొరియాకు. గత ఏడాది డిసెంబర్, ఈ సంవత్సరం జనవరిల్లో ఉత్తర కొరియా వరుసగా బాలిస్టిక్ మిస్సైళ్లను టెస్ట్ ఫైర్ చేసింది. ఏకంగా ఏడు క్షిపణులను పరీక్షించింది. వాటన్నింటినీ దక్షిణ కొరియా సముద్ర జలాల్లోకి సంధించింది. హ్వాసాంగ్-2 ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌ను పరీక్షించింది. అదే సిరీస్‌లోని హ్వాసాంగ్ 17ను తాజాగా ప్రయోగించింది.

రెండేళ్లుగా స్తంభించిన చర్చలు..

రెండేళ్లుగా స్తంభించిన చర్చలు..

అణ్వస్త్రాల ప్రయోగాలు, ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడంపై ఇది వరకు అమెరికా-ఉత్తర కొరియా మధ్య చర్చలు సాగాయి. దీనిపై 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కిమ్‌జొంగ్ ఉన్ స్వయంగా ఈ చర్చల్లో పాల్గొన్నారు. కొన్ని కీలక విషయాల్లో ఏకాభిప్రాయం కుదురకపోవడంతో చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొంది. ఆ తరువాత అమెరికా కొన్ని ఆంక్షలను విధించింది ఉత్తర కొరియాపై. వాటిని పరిగణనలోకి తీసుకోవట్లేదు కిమ్‌జొంగ్. తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటూనే ఉన్నారు. న్యూక్లియర్ వెపన్స్‌కు ప్రాధాన్యత ఇస్తోన్నారు.

English summary
North Korean leader Kim Jong Un guided the successful test-launch of a new “powerful tool for nuclear attack” called the Hwasong-17 intercontinental ballistic missile (ICBM).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X